రాబోయే ఎన్నికల్లో బీఎస్పీదే అధికారం..

లక్నో: దళితులు, బ్రాహ్మణులు ఏకమై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బ్రాహ్మణులలోకి పార్టీని తీసుకెళ్లేందుకు ‘ప్రబుద్ వర్గ సమ్మేళన్’ పేరిట నెలరోజులుగా బీఎస్పీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా మాయావతి బుధవారం మాట్లాడారు. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు గప్పాలు కొట్టడం తప్ప క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ రెండు పార్టీలు దళిత, బ్రాహ్మణులను ఓట్ల కోసమే వాడుకుంటాయని, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం […]

Update: 2021-09-07 09:53 GMT

లక్నో: దళితులు, బ్రాహ్మణులు ఏకమై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బ్రాహ్మణులలోకి పార్టీని తీసుకెళ్లేందుకు ‘ప్రబుద్ వర్గ సమ్మేళన్’ పేరిట నెలరోజులుగా బీఎస్పీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా మాయావతి బుధవారం మాట్లాడారు. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు గప్పాలు కొట్టడం తప్ప క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ రెండు పార్టీలు దళిత, బ్రాహ్మణులను ఓట్ల కోసమే వాడుకుంటాయని, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మర్చిపోతాయని ఆరోపించారు. కానీ, బీఎస్పీ అలా కాదన్న విషయం 2007-2012 లోనే రుజువైందని తన పాలనను గుర్తుచేశారు.

తమ హయాంలో రాష్ట్రంలోని ఇతర వర్గాలతోపాటు దళితులు, బ్రాహ్మణులకూ భద్రత, సంక్షేమంలో ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీపైనా మాయావతి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని మీరట్, ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లపై పట్టించుకోలేదని చెప్పారు. ఆ పార్టీ మైనారిటీలకు రక్షణ కల్పించలేదని వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే దళిత, బ్రాహ్మణులపై ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. తాము రైతులకు మద్దతిస్తామని, బీఎస్పీని గెలిపిస్తే రాష్ట్రంలో సాగు చట్టాలను అమలు చేయబోమని చెప్పారు.

Tags:    

Similar News