కేఎల్ రాహుల్‌కు సారీ చెప్పిన మ్యాక్స్‌వెల్
దిశ, స్పోర్ట్స్ : కేఎల్ రాహుల్ టీమ్ ఇండియా కీపర్.. మ్యాక్స్‌వెల్ ఆసీస్ ఆల్‌రౌండర్.. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? రాహుల్‌కు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని మీకు అనుమానామా? అయితే మనం ఐపీఎల్ తాజా సీజన్‌ను గుర్తు చేసుకోవాలి. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైనది. రాహుల్, మయాంక్ అగర్వాల్ బ్యాటుతో రాణించినా.. మిగతా జట్టు సభ్యుల పేలవ ప్రదర్శన పంజాబ్‌కు భారంగా మారింది. […]
దిశ, స్పోర్ట్స్ : కేఎల్ రాహుల్ టీమ్ ఇండియా కీపర్.. మ్యాక్స్‌వెల్ ఆసీస్ ఆల్‌రౌండర్.. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? రాహుల్‌కు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని మీకు అనుమానామా? అయితే మనం ఐపీఎల్ తాజా సీజన్‌ను గుర్తు చేసుకోవాలి. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైనది. రాహుల్, మయాంక్ అగర్వాల్ బ్యాటుతో రాణించినా.. మిగతా జట్టు సభ్యుల పేలవ ప్రదర్శన పంజాబ్‌కు భారంగా మారింది. ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 108 పరుగులే చేశాడు.
ఈ సీజన్‌లో ఒక్క సిక్సర్ కూడా కొట్టకపోవడం గమనార్హం. అయితే శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మ్యాక్స్‌వెల్ కేవలం 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉండటం గమనార్హం. ఆ సమయంలో వికెట్ల వెనుక రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో అతడు ఐపీఎల్‌లో పేలవ ఫామ్ కోసం రాహుల్‌కు క్షమాపణలు చెప్పినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.