శ్రీరాం సాగర్‌కు భారీగా ఇన్ ఫ్లో
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వర ప్రధాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలకు తోడు అక్కడి ప్రాజెక్టులు నిండటంతో వాటి గేట్లను ఎత్తివేశారు. ఈ క్రమంలో SRSPలోకి భారీగా వరద నీరు వచ్చి చెరుతోంది. గురువారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 TMCలకుగాను 60.063 TMCల నీరు నిల్వ ఉంది. ఉదయం 1,83,883 క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టులో చేరింది. మహారాష్ట్రలోని […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వర ప్రధాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలకు తోడు అక్కడి ప్రాజెక్టులు నిండటంతో వాటి గేట్లను ఎత్తివేశారు. ఈ క్రమంలో SRSPలోకి భారీగా వరద నీరు వచ్చి చెరుతోంది. గురువారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 TMCలకుగాను 60.063 TMCల నీరు నిల్వ ఉంది. ఉదయం 1,83,883 క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టులో చేరింది.
మహారాష్ట్రలోని విష్ణుపూరి ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి 11,901 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. బాలేగాన్ ప్రాజెక్టుకు సంబంధించి 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 1,38,144 క్యూసెక్కుల వాటర్ రావడంతో మొత్తం 64.677 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నిండటానికి 26 TMCల నీరు అవసరం ఉండగా మహారాష్ర్టలో కురుస్తున్న భారీ వర్షాలకు త్వరలో ప్రాజెక్ట్ నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.