చమురుబావిలో మంటలు.. 6 వేల మంది తరలింపు
గువహటి : అసోం టిన్సుకియా జిల్లాలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన చమురు బావిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ చమురు బావిలో గత 14 రోజుల నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు సింగపూర్ నుంచి ముగ్గురు నిపుణులు సోమవారం చమురు బావి వద్దకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం నిపుణుల పర్యవేక్షణలో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో ఘటనాస్థలిలో ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. సహాయక […]
గువహటి : అసోం టిన్సుకియా జిల్లాలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన చమురు బావిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ చమురు బావిలో గత 14 రోజుల నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు సింగపూర్ నుంచి ముగ్గురు నిపుణులు సోమవారం చమురు బావి వద్దకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం నిపుణుల పర్యవేక్షణలో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తుండగా మంటలు చెలరేగాయి.
దీంతో ఘటనాస్థలిలో ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పివేసేందుకు యత్నిస్తున్నారు. చమురుబావిలో సంభవించిన అగ్నిప్రమాదంపై అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు అసోం సీఎం. ఈ ప్రమాదంలో ఓఎన్జీసీకి చెందిన ఓ ఫైర్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారెవ్వరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని ఆయిల్ లిమిటెడ్ ఇండియా అధికారులు తెలిపారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. టీ గార్డెన్స్ కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. కొన్ని పక్షులు కూడా చనిపోయాయి. చమురు బావికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్యాస్ లీకేజీ వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 30 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ.