ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధి ధర్మాజీగూడెంలోని ప్రసిద్ధ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ రసాయన పరిశ్రమలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పురవ్వులు ఎగిరిపడటంతో రసాయన డ్రమ్ములు పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనా సమయంలో కంపెనీలో సుమారు 80 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించి అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెద్ద పెద్ద శబ్దాలతో […]
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధి ధర్మాజీగూడెంలోని ప్రసిద్ధ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ రసాయన పరిశ్రమలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పురవ్వులు ఎగిరిపడటంతో రసాయన డ్రమ్ములు పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనా సమయంలో కంపెనీలో సుమారు 80 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించి అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెద్ద పెద్ద శబ్దాలతో కెమికల్స్ డ్రమ్ములు పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. కంపెనీ యాజమాన్యం అందుబాటులో లేకపోవడం విచారకరం. స్థానిక ఫైర్ సిబ్బందితో మరో రెండు ఫైరింజన్లు ఇక్కడకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా.. మంటలు అదుపులోకి రావడం లేదు. నష్టంపై కంపెనీ యాజమాన్యాన్ని ఆరా తీయగా, మంటలు అదుపులోకి వస్తేగాని ఎం చెప్పలేం అని తెలిపారు.