ఇండియాలో రికార్డు.. కరోనా మరణాల్లో హైయస్ట్
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 92,596 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో 94,052 కేసులు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా రికార్డు స్థాయిలో 6,148 మంది మరణించారు. రోజువారీ మరణాల్లో ఇప్పటివరకు ఇదే రికార్డు అని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా 1,51,367 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 92,596 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో 94,052 కేసులు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా రికార్డు స్థాయిలో 6,148 మంది మరణించారు. రోజువారీ మరణాల్లో ఇప్పటివరకు ఇదే రికార్డు అని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా 1,51,367 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.
ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121కి చేరుకోగా.. 2,76,55,493 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్య 3,59,676కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,67,952 ఉన్నాయి. ఇప్పటివరకు 23,90,58,360 మందికి వ్యాక్సిన్ వేశారు.