Boxer Mary Kom : ఏసియన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో మేరీ కోమ్
దిశ, స్పోర్ట్స్: ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్(Boxer Mary Kom) దుబాయ్‌లో జరుగుతున్న ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్(Asian Boxing Championship Final)లోకి అడుగుపెట్టింది. 51 కేజీల విభాగంలో తలపడుతున్న మేరీ కోమ్ గురువారం మంగోలియాకు చెందిన లుస్తైఖాన్‌తో జరిగిన సెమీస్‌లో 4-1 బౌట్ల తేడాతో విజయం సాధించింది. మేరీ కోమ్ ఫైనల్ చేరడంతో బంగారు లేదా వెండి పతకం ఒకటి కన్ఫార్మ్ అయ్యింది. మరో బాక్సర్ మౌనిక […]
దిశ, స్పోర్ట్స్: ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్(Boxer Mary Kom) దుబాయ్‌లో జరుగుతున్న ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్(Asian Boxing Championship Final)లోకి అడుగుపెట్టింది. 51 కేజీల విభాగంలో తలపడుతున్న మేరీ కోమ్ గురువారం మంగోలియాకు చెందిన లుస్తైఖాన్‌తో జరిగిన సెమీస్‌లో 4-1 బౌట్ల తేడాతో విజయం సాధించింది. మేరీ కోమ్ ఫైనల్ చేరడంతో బంగారు లేదా వెండి పతకం ఒకటి కన్ఫార్మ్ అయ్యింది. మరో బాక్సర్ మౌనిక (48 కేజీలు) సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన అలువా బల్కిబెకోవా చేతిలో 0-5 బౌట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆమెకు కాంస్య పతకం దక్కింది. మేరీ కోమ్ ఈ ఫైనల్‌లో విజయం సాధిస్తే ఎనిమిదో సారి స్వర్ణం అందుకొని రికార్డు సృష్టించనున్నది.