ఐదేళ్లలో భారీగా అమ్ముడైన మారుతీ సుజుకి విటారా బ్రెజా!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి నుంచి వచ్చిన విటారా బ్రెజా మొత్తం 6 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించినట్టు కంపెనీ తెలిపింది. ఐదేళ్ల క్రితం 2016, మార్చిలో ఈ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆరు లక్షల యూనిట్ల అమ్మకాలతో మార్కెట్ లీడర్‌గా తన స్థనాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఇది తమ బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి నుంచి వచ్చిన విటారా బ్రెజా మొత్తం 6 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించినట్టు కంపెనీ తెలిపింది. ఐదేళ్ల క్రితం 2016, మార్చిలో ఈ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆరు లక్షల యూనిట్ల అమ్మకాలతో మార్కెట్ లీడర్‌గా తన స్థనాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఇది తమ బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని, ముఖ్యంగా సాంప్రదాయ డీజిల్ విభాగం ఎక్కువ మంది ఇష్టపడ్డారని’ మారుతీ సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. మెరుగైన ఫీచర్లు, అద్భుతమైన పనితీరు, డ్రైవింగ్ సౌకర్యాలతో పూర్తిగా ప్రీమియం అనుభవాన్ని విటారా బ్రెజా అందిస్తున్నట్టు వినియోగదారులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.