మారుతీ కారు వినియోగదారులకు శుభవార్త

ముంబయి: ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారుల కార్ల సర్వీసు, వారంటీ గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా పరిమిత స్థాయిలోనే మారుతీ సర్వీసు సెంటర్లు తెరిచి ఉన్నాయి. ఫ్రీ సర్వీసు, వారంటీ గడువు మే నెలతో ముగుస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జూన్ ఆఖరు వరకు మారుతీ సుజుకీ గడువు పెంపు నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా సర్వీసులు పొందలేని […]

Update: 2020-05-30 10:49 GMT

ముంబయి: ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారుల కార్ల సర్వీసు, వారంటీ గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా పరిమిత స్థాయిలోనే మారుతీ సర్వీసు సెంటర్లు తెరిచి ఉన్నాయి. ఫ్రీ సర్వీసు, వారంటీ గడువు మే నెలతో ముగుస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జూన్ ఆఖరు వరకు మారుతీ సుజుకీ గడువు పెంపు నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా సర్వీసులు పొందలేని వినియోగదారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.

Tags:    

Similar News