జగద్గిరిగుట్టలో వివాహిత ఆత్మహత్య

దిశ, వెబ్‎డెస్క్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‎లోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… పాపిరెడ్డినగర్‎లో కృష్ణప్రియ అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం కృష్ణప్రియను అత్తింటివారు వేధించేవారని.. వారే తన కూతురిని చంపేశారంటూ మృతురాలి తల్లి ఆరోపించారు. బంగారం పెడితేనే తన కూతురిని పుట్టింటికి పంపిస్తామని కృష్ణప్రియ తల్లి వెల్లడించారు. కాగా, కృష్ణప్రియ ఐదు నెలల గర్భిణీ. కేసు […]

Update: 2020-10-22 02:33 GMT

దిశ, వెబ్‎డెస్క్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‎లోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… పాపిరెడ్డినగర్‎లో కృష్ణప్రియ అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం కృష్ణప్రియను అత్తింటివారు వేధించేవారని.. వారే తన కూతురిని చంపేశారంటూ మృతురాలి తల్లి ఆరోపించారు. బంగారం పెడితేనే తన కూతురిని పుట్టింటికి పంపిస్తామని కృష్ణప్రియ తల్లి వెల్లడించారు. కాగా, కృష్ణప్రియ ఐదు నెలల గర్భిణీ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News