మార్కెట్లకు వేళాయే..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్ని రోజులు స్వచ్ఛంధంగా మూతబడిన మార్కెట్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోఠి పరిధిలోని బేగంబజార్, ట్రూప్ బజార్, సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్ 10రోజుల తర్వాత తిరిగి తెరచుకుంటున్నాయి. అయితే, ఎల్లప్పుడు ప్రజలతో రద్దీగా ఈ మార్కెట్లను మూసివేస్తే కొంతమేర వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చుననే ఉద్దేశ్యంతో దుకాణాలను మూసివేయాలని వ్యాపార సంఘాలు తీర్మానించిన విషయం విదితమే. వ్యాపారస్తులు ప్రకటించుకున్న స్వచ్ఛంధ లాక్‌డౌన్ పీరియడ్ ఆదివారంతో ముగియడంతో సోమవారం మార్కెట్లు […]

Update: 2020-07-05 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్ని రోజులు స్వచ్ఛంధంగా మూతబడిన మార్కెట్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోఠి పరిధిలోని బేగంబజార్, ట్రూప్ బజార్, సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్ 10రోజుల తర్వాత తిరిగి తెరచుకుంటున్నాయి. అయితే, ఎల్లప్పుడు ప్రజలతో రద్దీగా ఈ మార్కెట్లను మూసివేస్తే కొంతమేర వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చుననే ఉద్దేశ్యంతో దుకాణాలను మూసివేయాలని వ్యాపార సంఘాలు తీర్మానించిన విషయం విదితమే. వ్యాపారస్తులు ప్రకటించుకున్న స్వచ్ఛంధ లాక్‌డౌన్ పీరియడ్ ఆదివారంతో ముగియడంతో సోమవారం మార్కెట్లు ఓపెన్ కానున్నాయి.

Tags:    

Similar News