పదేండ్లలో రూ.500 లక్షల కోట్లకు సెన్సెక్స్

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది మార్చిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఏళ్ల నాటి కనిష్ఠానికి చేరుకున్న తర్వాత ఇటీవల వరుస జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. 2020 సమయంలో పెట్టుబడిదారుల సంపద రూ. 100.52 లక్షల కోట్లుగా ఉండగా, సరిగ్గా 10 నెలల తర్వాత స్టాక్ మార్కెట్ల సంపద రూ. 100 లక్షల కోట్లను సాధించింది. ఈ క్రమంలోనే గురువారం బీఎస్ఈలో 4,722 లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 2,00,47,191.31 కోట్లకు చేరుకుని సరికొత్త రికార్డులను మార్కెట్లు […]

Update: 2021-02-05 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది మార్చిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఏళ్ల నాటి కనిష్ఠానికి చేరుకున్న తర్వాత ఇటీవల వరుస జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. 2020 సమయంలో పెట్టుబడిదారుల సంపద రూ. 100.52 లక్షల కోట్లుగా ఉండగా, సరిగ్గా 10 నెలల తర్వాత స్టాక్ మార్కెట్ల సంపద రూ. 100 లక్షల కోట్లను సాధించింది. ఈ క్రమంలోనే గురువారం బీఎస్ఈలో 4,722 లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 2,00,47,191.31 కోట్లకు చేరుకుని సరికొత్త రికార్డులను మార్కెట్లు సాధించాయి. తాజాగా, 2021-22కి కేంద్ర బడ్జెట్‌కు ముందు బీఎస్ఈ సెన్సెక్స్ 46 వేల స్థాయిలో ఉండగా, బడ్జెట్ ప్రకటన తర్వాత కేవలం 4 రోజుల్లోనే 50 వేల మైలురాయిని దాటింది.

ప్రస్తుతం 51 వేలకు చేరువలో ఉంది. నిఫ్టీ సైతం 15 వేల దిశగా ట్రేడవుతోంది. గత 4 సెషన్‌లలోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 14.34 లక్షల కోట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుకోవచ్చని మార్కెట్ల పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ ప్రతి పదేళ్లకు మూడు రెట్ల వృద్ధిని సాధిస్తోందని, ప్రతి ఏడాది 16 శాతం సమ్మిళిత వృద్ధిని కనబరుస్తోందని, ఈ ప్రాతిపదికన రాబోయే 5 ఏళ్లలో సెన్సెక్స్ లక్ష పాయింట్లకు, 2030 నాటికి 1.5 లక్షల పాయింట్లకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీన్ని బట్టి ఆ సమయానికి సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 500 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News