రెచ్చిపోయిన నక్సల్స్.. 10 వాహనాలకు నిప్పు
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు వరుస సంఘటనలతో వణుకు పుట్టిస్తున్నారు. ఆదివారం రాత్రి సుకుమా జిల్లా ఎర్ర బోర్ – దర్బగూడ నడుమ రహదారిపై వెళుతున్న వాహనాలను ఆపి మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటనలో 8 నుంచి 10 వాహనాలు తగులబడినట్లు తెలిసింది. 26న బంద్‌కి పిలుపునిచ్చిన నక్సల్స్ ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాల దగ్దం గురించి తెలిసి ఆ ప్రాంతానికి చూడటానికి వెళ్ళిన యువకులపై మావోయిస్టులు తమవద్ద ఉన్న బాణాలు రాళ్లతో దాడి […]
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు వరుస సంఘటనలతో వణుకు పుట్టిస్తున్నారు. ఆదివారం రాత్రి సుకుమా జిల్లా ఎర్ర బోర్ – దర్బగూడ నడుమ రహదారిపై వెళుతున్న వాహనాలను ఆపి మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటనలో 8 నుంచి 10 వాహనాలు తగులబడినట్లు తెలిసింది. 26న బంద్‌కి పిలుపునిచ్చిన నక్సల్స్ ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాల దగ్దం గురించి తెలిసి ఆ ప్రాంతానికి చూడటానికి వెళ్ళిన యువకులపై మావోయిస్టులు తమవద్ద ఉన్న బాణాలు రాళ్లతో దాడి చేసినట్లుగా సమాచారం.