చాకచక్యంగా తప్పించుకున్న మావోయిస్ట్

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ఎత్తున పోలీసుల కూంబింగ్ సాగుతున్నది. మావోయిస్టు సీనియర్ నేత, రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ సహా కొందరు సభ్యులు చాకచక్యంగా తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ ధ్రువీకరించారు. గత పక్షం రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో భాస్కర్ సహా దళం సభ్యుల కదలికలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన […]

Update: 2020-07-13 05:22 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ఎత్తున పోలీసుల కూంబింగ్ సాగుతున్నది. మావోయిస్టు సీనియర్ నేత, రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ సహా కొందరు సభ్యులు చాకచక్యంగా తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ ధ్రువీకరించారు. గత పక్షం రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో భాస్కర్ సహా దళం సభ్యుల కదలికలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో వరుసగా కూంబింగ్ జరుగుతోంది. తాజాగా సోమవారం ఉదయం నుంచి తిర్యాని, మంగి అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించిన ప్రాంతం నుంచి భాస్కర్ సహా ఇతర సభ్యులు తప్పించుకున్నారు. ఈ ప్రాంతంలో విప్లవ సాహిత్యంతోపాటు డిటోనేటర్లు, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రికల్ పరికరాలు లభించాయని ఎస్పీ ప్రకటించారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Tags:    

Similar News