భారీ అగ్ని ప్రమాదం.. ఏకంగా 38 మంది ఆహుతి..
దిశ, వెబ్ డెస్క్: ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 38 మంది అమాయకులు ఆహుతైపోయారు. బంగ్లాదేశ్ లో 500 మంది ప్రయాణిస్తున్న పడవలో ఈ ప్రమాదం జరిగింది. ఝలకతిలోని సుగంధ నదిపై లాంచీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చాలా మంది నదిలోకి దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారు. శుక్రవారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు దృవీకరించారు. ఇంజన్ రూమ్ లో జరిగిన చిన్న తప్పిదం వల్లే మంటలు వ్యాప్తి చెందాయని ప్రాథమికంగా అంచనా […]
దిశ, వెబ్ డెస్క్: ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 38 మంది అమాయకులు ఆహుతైపోయారు. బంగ్లాదేశ్ లో 500 మంది ప్రయాణిస్తున్న పడవలో ఈ ప్రమాదం జరిగింది. ఝలకతిలోని సుగంధ నదిపై లాంచీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చాలా మంది నదిలోకి దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారు. శుక్రవారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు దృవీకరించారు. ఇంజన్ రూమ్ లో జరిగిన చిన్న తప్పిదం వల్లే మంటలు వ్యాప్తి చెందాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
మంటల్లో గాయాలపాలు అయిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో 38 మంది చనిపోగా మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. 200 మంది దాకా గాయాల పాలు అయ్యారు. 2 గంటలకు పైగా కష్టపడి సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.