డబ్బు ఆకాశం నుంచి పడదు : మంజిమా మోహన్

దిశ, వెబ్‌డెస్క్: సినీ తారలు, రాజకీయ ప్రముఖులు కరోనా వైరస్ ప్రభావం గురించి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. దయచేసి ఇంట్లో ఉండాలని కోరుతున్నారు. కానీవారి అభ్యర్థనలను కూడా కామెంట్ చేస్తున్నారు కొందరు. మనకోసం మంచి చెప్పినా… చెడుగానే భావిస్తున్నారు. అలాంటి సందర్భమే ఎదురైంది ‘సాహసమే శ్వాసగా సాగిపో’ ఫేం మంజిమా మోహన్‌కు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంట్లో ఉండాలని చెబుతుంటే… ఎందుకు రోడ్ల మీదకు వెళ్తున్నారో అసలు అర్ధం కావడం లేదని… ఇంట్లో ఉండేందుకు ఎందుకంత కష్టంగా […]

Update: 2020-03-25 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ తారలు, రాజకీయ ప్రముఖులు కరోనా వైరస్ ప్రభావం గురించి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. దయచేసి ఇంట్లో ఉండాలని కోరుతున్నారు. కానీవారి అభ్యర్థనలను కూడా కామెంట్ చేస్తున్నారు కొందరు. మనకోసం మంచి చెప్పినా… చెడుగానే భావిస్తున్నారు. అలాంటి సందర్భమే ఎదురైంది ‘సాహసమే శ్వాసగా సాగిపో’ ఫేం మంజిమా మోహన్‌కు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంట్లో ఉండాలని చెబుతుంటే… ఎందుకు రోడ్ల మీదకు వెళ్తున్నారో అసలు అర్ధం కావడం లేదని… ఇంట్లో ఉండేందుకు ఎందుకంత కష్టంగా ఫీలవుతున్నారని .. ఇంట్లో సురక్షితంగా ఉండాలని కోరుతూ ట్వీట్ చేసింది మంజిమా. అయితే దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. హలో బొద్దుగుమ్మా… మేము ఇంట్లో ఉంటే నువ్వేమైనా భోజనం పెడ్తావా అని ప్రశ్నించాడు.

దీంతో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది మంజిమా మోహన్. సాధారణంగా నేనిలాంటి ట్వీట్లకు రిప్లై ఇవ్వను కానీ ఇప్పుడు ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండేందుకు ఇష్టపడరు… ఎందుకంటే మనకోసం ఆకాశం నుంచి డబ్బు పడదు కదా… కానీ పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవాలని చెప్పింది. ఇంట్లో లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని.. మీరు మాత్రమే కాదు మీ వల్ల చాలా మంది నష్టపోతారంది.

Tags: Manjima Mohan, Lockdown, Tweet War, Strong Reply

Tags:    

Similar News