పింఛన్లలో అవకతవకలు.. గవర్నర్ కు వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పింఛన్ల అవకతవకలపై విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏటా 7200 కోట్లు ఖర్చు చేసి పింఛన్లు అందజేస్తోందని, గత ఐదేళ్లుగా ఆసరా పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతోందని పత్రికల్లో వార్తలు వస్తున్నా అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పింఛన్ల అవకతవకలపై విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏటా 7200 కోట్లు ఖర్చు చేసి పింఛన్లు అందజేస్తోందని, గత ఐదేళ్లుగా ఆసరా పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతోందని పత్రికల్లో వార్తలు వస్తున్నా అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ జిల్లా ఆసిఫ్ నగర్ మండలంలో ఆసరా పింఛన్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పత్రికల్లో రావడంతో ఆర్డీఓ విచారణ చేసి 2014 అక్టోబర్ నుంచి డిసెంబర్ 2015 వరకు రూ.30లక్షల అవినీతి జరిగిందని ఆన్ లైన్ లో కాక వ్యక్తులను పిలిచి ఇచ్చిన దాంట్లో 14లక్షలు అవకతవకలు జరిగాయని, మొత్తం 44 లక్షల పింఛన్లు తహసీల్దార్ ఆసిఫ్ నగర్ మరియు అతని8 మంది సిబ్బంది అవినీతిలో భాగస్వాములని వెల్లడైందన్నారు.
అదికాక చాలా రషీదు పుస్తకాల్లో తప్పుడు వేలిముద్రలతో డబ్బు తీసుకున్నారని వాటన్నింటి ద్వారా విచారణ చేయాలని కోరినట్లు తెలిపారు. అదే విధంగా వరంగల్ లో కూడా జరిగాయని పత్రికల్లో వార్తలు వచ్చాయని, దీనికి తోడు చార్మినార్ మండలంలో కూడా అవినీతి జరిగిందని ఈ విషయంపై రాష్ట్ర ప్రధానకార్యదర్శికి, రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ కు వినతిపత్రం అందజేశామని అయినా నేటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా కేసు విచారణలో ఉందని కమిషనర్ కార్యాలయం అధికారులు పేర్కొనడం శోఛనీయమన్నారు. ఇప్పటికైన స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.