ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై మాణిక్కం ఠాగూర్ సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: పీసీసీ చీఫ్ ప్రకటన సంగతేమోగానీ త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, పలు స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ గురువారం గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మొదలు సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ నేతలు హాజరయ్యారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గురువారం నేతల నుంచి అభిప్రాయాలను ఈ సమావేశంలో […]

Update: 2021-01-21 11:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీసీసీ చీఫ్ ప్రకటన సంగతేమోగానీ త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, పలు స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ గురువారం గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మొదలు సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ నేతలు హాజరయ్యారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గురువారం నేతల నుంచి అభిప్రాయాలను ఈ సమావేశంలో తీసుకున్న మాణిక్కం ఠాగూర్ శుక్రవారం వరుసగా మూడు సమావేశాలను నిర్వహించనున్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఏ అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలు ఉంటాయి, ఎవరెవరు పోటీపడాలనుకుంటున్నారు, వారికి ఉన్న ప్రజాదరణ ఏంటి తదితరాలన్నింటిపై ఆరా తీయనున్నారు. మధ్యాహ్నం తర్వాత నాగార్జున్ సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రానికి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై సమీక్ష జరపనున్నారు. గురువారం జరిపిన సమీక్ష సందర్భంగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీపడుతున్న నేతలు, వారికి ఉన్న విజయావకాశాలు, ప్రభుత్వం పట్ల గ్రాడ్యుయేట్లలో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు ఏ మేరకు కలిసొస్తుందని, టీఆర్ఎస్, బీజేపీలకు ఉన్న అవకాశాలు తదితరాలన్నింటిపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాణిక్కం ఠాగూర్ చర్చించారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, రాష్ట్ర నాయకుడు బెల్లయ్య నాయక్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పార్టీ నేతల సమాచారం ప్రకారం రాములునాయక్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కానీ బెల్లయ్య నాయక్ కూడా గట్టిగానే పట్టుబడుతున్నారు.

ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయడానికి సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీఎన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో సీనియర్ నేతగా, ప్రజాదరణ ఉన్న నాయకుడిగా చిన్నారెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వంశీచంద్‌రెడ్డి కూడా పోటీకి ఉత్సాహం చూపుతున్నందువల్ల ఆయనకు నచ్చచెప్పాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News