కాంగ్రెస్ లక్ష్యం… మిషన్ 2023

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కేంద్రంలో బీజేపీ సర్కార్ అంబాని-ఆధానీలను కాపాడే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో కేసీఆర్ ఆయన కొడుకు, కూతురు, అల్లుళ్ళ కోసం తాపత్రయప పడుతున్నాడని టీపీసీసీ వ్యవహారాల ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… రానున్న రోజుల్లో తెలంగాణలో కొత్త కాంగ్రెస్ పార్టీని చూడబోతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిషన్ 2023 లక్ష్యంగా కాంగ్రెస్ […]

Update: 2020-11-03 05:35 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కేంద్రంలో బీజేపీ సర్కార్ అంబాని-ఆధానీలను కాపాడే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో కేసీఆర్ ఆయన కొడుకు, కూతురు, అల్లుళ్ళ కోసం తాపత్రయప పడుతున్నాడని టీపీసీసీ వ్యవహారాల ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… రానున్న రోజుల్లో తెలంగాణలో కొత్త కాంగ్రెస్ పార్టీని చూడబోతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిషన్ 2023 లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళుతూ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ఆధికారం చేపట్టబోతుందని ఠాగూర్ జోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ ఆయన కుటుంబానికి మాత్రమే బంగారు రోజులు తీసుకువస్తున్నారని విమర్శించారు. అలాగే మోడీ సర్కారుకు కేసీఆర్ భయపడుతూ కేంద్ర ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ మద్దతు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలని సవాల్ విసిరారు.

Tags:    

Similar News