ఓటరు దేవుడా కనికరించు.. గ్రేటర్ పట్టం కట్టు!

దిశ, తెలంగాణ బ్యూరో: రంగురంగు కాగితాలతో రూపొందిన పార్టీల ప్రణాళికలు జనానికి అర చేతిలో స్వర్గాన్ని చూపుతున్నాయి. పోటాపోటీగా విడుదల అయిన మేనిఫెస్టోలు నేల విడిచి సాము చేస్తున్నాయి. అవి అమలు కావాలంటే కుబేరుడు దిగిరావాల్సిందే. ‘బల్దియా ఆదాయం తోకంత…హామీల విలువ మాత్రం కొండంత’ అన్నట్టుగా ఉంది. మాటల మాయాజాలం ప్రజలను ఆలోచనలో పడవేస్తోంది. సామాన్యులు మాత్రం పదాడంబరాలతో మాకు పనేమిటి? ‘కూడు..గూడు’ ఉంటే చాలంటున్నారు. బాధ కలిగినపుడు తోడుగా నిలుచుంటే కడుపులో పెట్టుకుని చూసుకుంటామంటున్నారు. బల్దియా […]

Update: 2020-11-26 23:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రంగురంగు కాగితాలతో రూపొందిన పార్టీల ప్రణాళికలు జనానికి అర చేతిలో స్వర్గాన్ని చూపుతున్నాయి. పోటాపోటీగా విడుదల అయిన మేనిఫెస్టోలు నేల విడిచి సాము చేస్తున్నాయి. అవి అమలు కావాలంటే కుబేరుడు దిగిరావాల్సిందే. ‘బల్దియా ఆదాయం తోకంత…హామీల విలువ మాత్రం కొండంత’ అన్నట్టుగా ఉంది. మాటల మాయాజాలం ప్రజలను ఆలోచనలో పడవేస్తోంది. సామాన్యులు మాత్రం పదాడంబరాలతో మాకు పనేమిటి? ‘కూడు..గూడు’ ఉంటే చాలంటున్నారు. బాధ కలిగినపుడు తోడుగా నిలుచుంటే కడుపులో పెట్టుకుని చూసుకుంటామంటున్నారు.

బల్దియా మేయర్​ పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి. కనికరించమంటూ ఓటరు దేవుడిని వేడుకుంటున్నాయి. వరద బాధితుడి ముందు మోకరిల్లుతున్నాయి. సాధారణ ఎన్నికల కంటే ఇప్పుడే ఆకర్షణీయ హామీలను గుప్పిస్తున్నాయి. ఆకట్టకునే పథకాలను రూపొందిస్తున్నాయి. అందరి మేనిఫెస్టోలూ పేద, మధ్య తరగతికి కలల సౌధాన్ని నిర్మిస్తున్నాయి. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు రూ.లక్ష కోట్ల విలువైన హామీలను ప్రకటించాయి. మేనిఫెస్టోలు కవరు పేజీ నుంచి చివరి పేజీ వరకు అందమైన డిజైన్లతో, ఆకట్టుకునే పదకట్టుతో ఉన్నాయి. అన్ని పార్టీలు వరద బాధితుల మీదనే దృష్టి సారించాయి.

వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఒకదానిని మించి మరొకటి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించాయి. మూసీని శుద్ధి చేస్తామని ఒక పార్టీ అంది. గోదావరి నదితో అనుసంధానం చేస్తామంటూ మరొక పార్టీ ప్రకటించింది. బోటింగ్​చేసేంతస్థాయిలో హుస్సేన్ సాగర్ ను తీర్చిదిద్దుతామని అధికార పార్టీ హామీ ఇచ్చేసింది. రవాణా, వైద్యం, విద్య, ఉపాధి కల్పన వంటి ప్రతి రంగానికీ ప్రాధాన్యత కల్పించింది. ఒక్కొక్క హామీకి రూ.వేల కోట్లు ఖర్చయ్యే అవకాశాలే ఉన్నాయి. బల్దియా ఆదాయం కంటే పదింతలుగా ఈ హామీలు కనిపిస్తున్నాయి.

వీటన్నింటి మీద ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్​ఆవిష్కరించారు.​బీజేపీ ప్రణాళికను మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్ విడుదల​చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను రాష్ట్ర నాయకత్వమంతా కలిసి పరిశీలకుడి సమక్షంలోనే ఆవిష్కరించింది. టీడీపీ కూడా ఆకట్టుకునే రీతిలోనే హామీల పత్రాన్ని ప్రజల ముందు ఉంచింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో దీనిని ఆవిష్కరించారు.

మూడు పార్టీల మ్యానిఫెస్టోల్లోని ప్రధానాంశాలు:

బీజేపీ మూట:

= ముంపు బాధితులకు రూ.25 వేల వరద సాయం
= ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు, ఉచితంగా వ్యాక్సిన్
= ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య పరీక్షలు. ఉచితంగా చికిత్స
= ఎల్ఆర్ఎస్ రద్దు. ప్రభుత్వం వినకపోతే జీహెచ్ఎంసీ ఆ భారాన్ని భరిస్తుంది
= ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద లక్ష మంది పేద కుటుంబాలకు సొంత ఇండ్లు
= ఇంటింటికీ నల్లా కనెక్షన్లు. 24 గంటలు ఉచితంగా తాగునీటి సరఫరా
= ఎస్సీ కాలనీలు, బస్తీలలో ఆస్తి పన్ను మాఫీ
= సెలూన్లు, దోబీఘాట్లు, ఫుట్వేర్ రిపేరింగ్, నేతన్నలు, గేదెలు, కోళ్ల పెంపకందారులకు కరెంటు ఫ్రీ
= నగరానికి అన్ని వైపులా మెట్రో రైలు విస్తరణ
= విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్ లు, ఫ్రీ వైఫై
= ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ
= 125 గజాల్లోపు ఇండ్లకు అనుమతి అక్కర్లేదు
= ప్రతి జంక్షన్ కు ఓ ఫ్లైఓవరు
= కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత
= మూసీ నది కంపు లేకుండా ప్రక్షాళన
= పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ

కాంగ్రెస్ ముల్లె:
= వరద బాధితులకు కుటుంబానికి రూ.50 వేల సాయం
= ఆరోగ్య శ్రీ పథకంలో కరోనా చికిత్స
= ఆస్పత్రుల సంఖ్య 400కు పెంపు
= ఉచితంగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ (ధరణి పోర్టల్ రద్దు)
= అర్హత కలిగినవారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు
= 30 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా
= రూ.50 వేల వరకు ఆస్తి పన్నులో రాయితీ
= 100 యూనిట్ల లోపు వారికి విద్యుత్తు రాయితీ
= మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులను పాతబస్తీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరణ
= ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ
= మూసీనది పరివాహక ప్రాంతంలోని చెరువుల పునరుద్ధరణ. వర్షపు నీటి మూసీలోకి మళ్లింపు

టీఆర్ఎస్ మాట:
= ముంపు బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సాయం
= నగరానికి నలువైపులా టిమ్స్ లు. 350 బస్తీ దవాఖానాలు
= ఎల్ఆర్ఎస్ కొనసాగింపు
= పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు. లక్ష ఇండ్లు. స్థలాలు ఉన్న వారికి ఆర్ధిక సాయం రూ.5 లక్షల లోపు
= 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్లు
= ఆస్తి పన్నులో ఎలాంటి పెంపు ఉండదు
= సెలూన్లు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు
= శంషాబాద్​వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ
= ఇండ్ల అనుమతి యథాతథం
= రీజినల్ రింగు రోడ్డు. 125 చోట్ల లింకు రోడ్లు. ఎలివేటెడ్​ బీఆర్టీఎస్​.
= మూసీ నది శుద్ధీకరణ. గోదావరి నదితో అనుసంధానం, హుస్సేన్ సాగర్​ లో బోటింగ్ ఏర్పాట్లు

Tags:    

Similar News