సర్పంచ్ కొడుకు క్రూరత్వం.. చెప్పింది చేయాలంటూ అంగన్వాడీ టీచర్‌కు బెదిరింపులు

దిశ, చింతకాన : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాన మండల పరిధిలోని చిన్న మండవ గ్రామంలో ఓ సర్పంచ్ కొడుకు అంగన్వాడీ టీచర్ నండ్రు జ్యోతిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు దిగాడు. ఐసీడీఎస్ అధికారులుకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కిరాయి గదులను ఖాళీ చేసి దగ్గరలోని ప్రైమరీ స్కూల్‌కు వెళ్లాలని సూచించారు. అందుకు గాను టీచర్ జ్యోతి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంను సంప్రదించగా, అక్కడ స్థలం లేదని చెప్పింది. ఊరి చివరన ఉన్నటువంటి హైస్కూల్లో రూములు […]

Update: 2021-11-24 08:37 GMT

దిశ, చింతకాన : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాన మండల పరిధిలోని చిన్న మండవ గ్రామంలో ఓ సర్పంచ్ కొడుకు అంగన్వాడీ టీచర్ నండ్రు జ్యోతిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు దిగాడు. ఐసీడీఎస్ అధికారులుకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కిరాయి గదులను ఖాళీ చేసి దగ్గరలోని ప్రైమరీ స్కూల్‌కు వెళ్లాలని సూచించారు. అందుకు గాను టీచర్ జ్యోతి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంను సంప్రదించగా, అక్కడ స్థలం లేదని చెప్పింది. ఊరి చివరన ఉన్నటువంటి హైస్కూల్లో రూములు ఖాళీగా ఉండటం వలన హైస్కూల్ హెచ్ఎంతో మాట్లాడితే అక్కడ ఉండటానికి అనుమతి ఇచ్చారు. టీచర్ జ్యోతి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని హైస్కూల్‌కు మార్పించింది.

అది నచ్చని సర్పంచ్ కొడుకు జ్యోతి పై పిల్లల తల్లితండ్రులకు తప్పుడు సమాచారం అందించాడు. అంతేకాకుండా ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు సమాచారం. సర్పంచ్ కొడుకునే అహంకారంతో వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలను పోస్ట్ చేశాడు. ఇదే విషయంపై అంగన్వాడీ టీచర్ ప్రశ్నించగా మేము చెప్పినట్లుగానే మీరు వినకుండా హైస్కూల్‌కు ఎందుకు వెళ్లావు.. నీ జాబ్ ఎలా ఉంటుందో నేను చూస్తానని బెదిరింపులకు గురిచేసినట్టు తెలిసింది. సర్పంచ్ కొడుకు వలన తాను మానసికంగా కుంగిపోయినట్టు పేర్కొంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి దీనిపై విచారణ జరిపి సర్పంచ్ కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధిత టీచర్ కోరుతోంది.

Tags:    

Similar News