హుజురాబాద్ కోసం కేసీఆర్ నయవంచన.. సవాల్ చేసిన మందకృష్ణ

దిశ, కాళోజీ జంక్షన్: ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాగానే కేసీఆర్ విందు రాజకీయం మొదలుపెట్టారని మందకృష్ణ మాదిగ విమర్శించారు. హన్మకొండలోని వడ్డేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల్లో భాగంగానే దళిత బంధు తీసుకొచ్చారని తెలిపారు. దళితులను నమ్మించడానికి కేసీఆర్ విందుకు ఆహ్వానించారని.. ఎన్నికల్లో లబ్ధి కోసం నయవంచన‌కు గురిచేయడం దారుణమన్నారు. గతేడాది జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి.. ఎన్నికలు ముగిసిన తర్వాత మొహం చాటేశారని మందకృష్ణ చెప్పుకొచ్చారు. […]

Update: 2021-07-26 08:26 GMT

దిశ, కాళోజీ జంక్షన్: ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాగానే కేసీఆర్ విందు రాజకీయం మొదలుపెట్టారని మందకృష్ణ మాదిగ విమర్శించారు. హన్మకొండలోని వడ్డేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల్లో భాగంగానే దళిత బంధు తీసుకొచ్చారని తెలిపారు. దళితులను నమ్మించడానికి కేసీఆర్ విందుకు ఆహ్వానించారని.. ఎన్నికల్లో లబ్ధి కోసం నయవంచన‌కు గురిచేయడం దారుణమన్నారు. గతేడాది జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి.. ఎన్నికలు ముగిసిన తర్వాత మొహం చాటేశారని మందకృష్ణ చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌ ఎన్నికల తర్వాత ఇదే సీన్ రిపీట్ అవుద్దని.. కేసీఆర్‌కు దళితులపై నిజమైన ప్రేమ ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పథకాలను విడుదల చేయాలని మందకృష్ణ మాదిగ సవాల్ విసిరారు.

Tags:    

Similar News