రెండో పెళ్లికి సిద్ధమైన మంచు మనోజ్?

దిశ, సినిమా : మంచు వారబ్బాయి త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మోహన్‌బాబు కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. మే 17 లేదా 18న ఈ వివాహం జరగనుందని టాక్. మనోజ్‌కు ఇంతకుముందే 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరగ్గా.. పలు కారణాల వల్ల వీరు 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి సారించిన […]

Update: 2021-02-12 05:05 GMT

దిశ, సినిమా : మంచు వారబ్బాయి త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మోహన్‌బాబు కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. మే 17 లేదా 18న ఈ వివాహం జరగనుందని టాక్. మనోజ్‌కు ఇంతకుముందే 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరగ్గా.. పలు కారణాల వల్ల వీరు 2019లో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత సినిమాలపై దృష్టి సారించిన మనోజ్.. కొత్తగా నిర్మాణ సంస్థను మొదలుపెట్టి, సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు మనోజ్‌కు మరో వివాహం చేయాలని డిసైడ్ అయ్యారట. కాగా ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మరో సినిమా చేయని మనోజ్, చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’తో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Tags:    

Similar News