బలపడిన బంధం.. బావామరుదులుగా మనోజ్, తేజ్‌!

హీరో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్‌లు వియ్యంకులైపోయారు. మనోజ్ అమ్మాయిని ఇస్తే.. తేజ్ అబ్బాయిని ఇవ్వగా బావమరుదులుగా కొత్త బంధం మొదలైనట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంతకీ విషయం ఏంటంటే మనోజ్ పెట్ డాగ్ టాంగో.. తేజ్ కుక్క పిల్ల జొయాలు క్రాసింగ్‌కు వచ్చాయి. దీంతో సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేసే సమయంలోనూ ఈ ఇద్దరినీ ఏకం చేశారట. మంచి అల్లుడిని ఇచ్చినందుకు తేజ్‌కు థ్యాంక్స్ చెప్పిన మనోజ్.. ‘త్వరలోనే ముహూర్తాలు పెట్టించి పత్రికలు పంచుదాం’ […]

Update: 2020-06-29 03:42 GMT

హీరో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్‌లు వియ్యంకులైపోయారు. మనోజ్ అమ్మాయిని ఇస్తే.. తేజ్ అబ్బాయిని ఇవ్వగా బావమరుదులుగా కొత్త బంధం మొదలైనట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంతకీ విషయం ఏంటంటే మనోజ్ పెట్ డాగ్ టాంగో.. తేజ్ కుక్క పిల్ల జొయాలు క్రాసింగ్‌కు వచ్చాయి. దీంతో సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేసే సమయంలోనూ ఈ ఇద్దరినీ ఏకం చేశారట. మంచి అల్లుడిని ఇచ్చినందుకు తేజ్‌కు థ్యాంక్స్ చెప్పిన మనోజ్.. ‘త్వరలోనే ముహూర్తాలు పెట్టించి పత్రికలు పంచుదాం’ అంటూ ట్విట్టర్‌లో డాగ్స్ డేటింగ్ డే పిక్స్ షేర్ చేశారు. తేజ్ ఏమైనా తక్కువ తిన్నాడా? మనోజ్ నా కోడలిని బంగారంలా చూసుకోవాలి అంటూ రిప్లై ఇచ్చాడు.

ఈ ఫన్నీ పోస్ట్‌పై నెటిజన్లు మరింత ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అన్నా.. కరోనా టైమ్ కదా పెళ్లికి రాలేమేమో కానీ.. పెళ్లి కానుకగా లార్జ్ పాకెట్ పెడిగ్రీ పంపిస్తున్నా’ అని అప్పుడే కానుకల గురించి మాట్లాడేస్తున్నారు. ఏదేమైనా హస్కీ బ్రీడ్ డాగ్స్ భలే ముద్దుగా ఉన్నాయంటున్న నెటిజన్లు.. ప్రతీ కుక్కకు ఓ రోజుస్తుందంటే ఇదే కాబోలు అంటున్నారు.

Tags:    

Similar News