కరోనా పేషెంట్ హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా లక్షణాలు ఉండడంతో తనకు వైరస్ సోకిందనే అనుమానంతో హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పశ్చిమ బెంగాల్ చెందిన పల్టుపాన్ (34) గోల్గ్ స్మిత్‌గా పనిచేస్తాడు. కొన్నేండ్లుగా భార్యతో సహా నగరంలోని దూద్ బౌలిలో స్థిరపడ్డాడు. గత 10 రోజులుగా కొవిడ్ లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ.. స్థానికంగా ఓ క్లినిక్‌లో చికిత్స తీసుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. తనకు […]

Update: 2020-07-05 12:04 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా లక్షణాలు ఉండడంతో తనకు వైరస్ సోకిందనే అనుమానంతో హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పశ్చిమ బెంగాల్ చెందిన పల్టుపాన్ (34) గోల్గ్ స్మిత్‌గా పనిచేస్తాడు. కొన్నేండ్లుగా భార్యతో సహా నగరంలోని దూద్ బౌలిలో స్థిరపడ్డాడు. గత 10 రోజులుగా కొవిడ్ లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ.. స్థానికంగా ఓ క్లినిక్‌లో చికిత్స తీసుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. తనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పినా.. అక్కడ చేర్చుకోలేదు. దీంతో శుక్రవారం రాత్రి తన స్నేహితుడు శ్రీరాములుకి ఫోన్ చేసి ట్యాంక్ బండ్‌కు తీసుకెళ్లాలని కోరాడు. ట్యాంక్ బండ్ వద్ద రాములును అక్కడే ఉండాలని చెప్పి కొంచెం ముందుకెళ్లి, హుస్సేన్ సాగర్‌లోకి దూకాడు. గమనించిన శ్రీరాములు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే గాలించినా ఆచూకీ లభించలేదు. గాలింపులో భాగంగా ఆదివారం పల్టుపాన్ మృతదేహం లభ్యమైంది.

Tags:    

Similar News