మందులకు కాదు.. మంత్రాలకు నిండు ప్రాణం బలి 

దిశ, వెబ్ డెస్క్: అక్షరాస్యత రేటు పెరుగుతున్నా, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా… ప్రజల్లో మూఢ నమ్మకాలు మాత్రం తొలగిపోవట్లేదు. మందులతో నయమవదని మంత్రాలకు రోగం తగ్గిపోతుందనే మూఢనమ్మకం నిండు ప్రాణాన్ని హరించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే… నందివనపర్తి గ్రామంలో మహేశ్ అనే యువకుడు దినసరి కూలీగా బ్రతుకు నెట్టుకొస్తున్నాడు. గత కొంతకాలంగా అతడిని అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. తీవ్రమైన కడుపు నొప్పితో తల్లడిల్లేవాడు. ఎన్ని ఆస్పత్రులు తిగిరినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో… బంధువుల […]

Update: 2020-08-25 07:26 GMT

దిశ, వెబ్ డెస్క్: అక్షరాస్యత రేటు పెరుగుతున్నా, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా… ప్రజల్లో మూఢ నమ్మకాలు మాత్రం తొలగిపోవట్లేదు. మందులతో నయమవదని మంత్రాలకు రోగం తగ్గిపోతుందనే మూఢనమ్మకం నిండు ప్రాణాన్ని హరించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో చోటుచేసుకుంది.

అసలు ఏం జరిగిందంటే… నందివనపర్తి గ్రామంలో మహేశ్ అనే యువకుడు దినసరి కూలీగా బ్రతుకు నెట్టుకొస్తున్నాడు. గత కొంతకాలంగా అతడిని అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. తీవ్రమైన కడుపు నొప్పితో తల్లడిల్లేవాడు. ఎన్ని ఆస్పత్రులు తిగిరినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో… బంధువుల సలహాలతో శ్రీహరి అనే మంత్రగాడిని ఆశ్రయించాడు.

అతడేవో మాయమాటలు చెప్పి రోగం నయం చేస్తానంటూ నమ్మబలికాడు. అందుకు రూ.20 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. రూ.10 వేలు అడ్వాన్స్ కింద ముందే తీసుకున్నాడు. ఏవో మంత్రాలు చదివి కొన్ని నాటు మందులు ఇచ్చి వాదమన్నాడు. ఆ మందులు, మంత్రాలకు రోగం నయం కాకపోగా మహేశ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం రాత్రి మృతి చెందాడు.

కాగా 7 నెలల క్రితమే మహేష్‌కు పెళ్లి అయింది. ప్రస్తుతం అతడి భార్య 6 నెలల గర్భవతి. మంత్రగాడిని నమ్మి.. అతను చెప్పినట్టే చేయడంతో భర్తను కోల్పోయానంటూ ఆమె రోదిస్తోంది. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News