వైఫై ఎలర్జీ’తో అనారోగ్యం పాలైన వ్యక్తి

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా పల్లెల్లో, పట్టణాల్లో రోజురోజుకూ మొబైల్ టవర్స్ సంఖ్య పెరుగుతున్నాయి. వీటి ద్వారా వెలువడే ఫ్రీక్వెన్సీ, రేడియేషన్‌తో పక్షులు, వాటి ఎగ్‌షెల్స్ ప్రమాదంలో పడుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పక్షులు మాత్రమే కాకుండా మనుషులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 5జీ, ఎలక్ట్రిసిటీ వల్ల ఓ వ్యక్తి ఎలర్జీకి గురయ్యాడు. అదెక్కడంటే? యూకేకు చెందిన 48 ఏళ్ల బ్రూనో బెర్రిక్‌కు ఎలక్ట్రిసిటీ, 5జీ అంటే ఎలర్జీ. ఎలక్ట్రిసిటీ, మొబైల్ ఫోన్ ‌మన దగ్గర్లో ఉంటే […]

Update: 2020-11-19 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా పల్లెల్లో, పట్టణాల్లో రోజురోజుకూ మొబైల్ టవర్స్ సంఖ్య పెరుగుతున్నాయి. వీటి ద్వారా వెలువడే ఫ్రీక్వెన్సీ, రేడియేషన్‌తో పక్షులు, వాటి ఎగ్‌షెల్స్ ప్రమాదంలో పడుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పక్షులు మాత్రమే కాకుండా మనుషులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 5జీ, ఎలక్ట్రిసిటీ వల్ల ఓ వ్యక్తి ఎలర్జీకి గురయ్యాడు. అదెక్కడంటే?

యూకేకు చెందిన 48 ఏళ్ల బ్రూనో బెర్రిక్‌కు ఎలక్ట్రిసిటీ, 5జీ అంటే ఎలర్జీ. ఎలక్ట్రిసిటీ, మొబైల్ ఫోన్ ‌మన దగ్గర్లో ఉంటే మనకు ఎలాంటి ప్రభావం కనిపించదు. కానీ, బెర్రిక్ శరీరం వాటి వల్ల ప్రభావితమవుతుంది. ఆయన మనకు ఓ లివింగ్ ప్రూఫ్. ‘నాలుగేండ్ల కిందట నా శరీరమంతా మంటలెక్కిపోయేవి. చాలా బరువు తగ్గిపోయాను. ఎప్పుడూ అలసటగా ఉండేది. కానీ, ఎందుకు అలా జరుగుతోంది నాకు అర్థమయ్యేది కాదు. నేను చాలా పవర్‌ఫుల్ బిల్డర్‌ను. ఈ సింప్టమ్స్ ఎందువల్ల వచ్చాయో తెలిసేది కాదు. అందుకే ఎంతో సమయం, మనీ ఖర్చు పెట్టి నాకు వచ్చిన ఈ రోగాన్ని తెలుసుకోవడానికి ప్రపంచమంతా ప్రయాణించాను. పెస్టిసైడ్ పాయిజన్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. అది పాజిటివ్ వచ్చింది. నాకున్న సింప్టమ్స్‌కు అది కూడా కారణం కాదు. తర్వాత తెలిసింది ఏంటంటే.. నాకు ఎలక్ట్రోమ్యాగ్నటిక్ హైపర్‌సెన్సిటివిటీ లేదా ఎలక్ట్రో సెన్సిటివిటీ అనే రేర్ డిసీజ్ ఉందని తెలిసింది’ అని బ్రూనో తెలిపాడు.

ఇంట్లో ఇంటర్నెట్ ఉండేది. వైఫై, స్మార్ట్ టీవీ కూడా ఉండేవి. వాటి ప్రభావం నా ఎముకల మీద పడింది. బ్రిగ్టన్‌లో జరిగిన ఓ సెమినార్‌లో నాలాంటి ప్రాబ్లెమ్‌తో సఫర్ అవుతున్న ఓ వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి సలహా, సూచనలతో వైఫై, ఫోన్స్, ఎలక్ట్రిసిటీలకు దూరంగా ఉండటం మొదలుపెట్టాను. నా భార్య, ముగ్గురు పిల్లలు టీవీ చూడటం మానేశారు. ఎక్కువ సమయం లైట్స్, హీటర్స్ స్విచ్ ఆఫ్ చేసేవారు. వింటర్‌లో మాత్రం నేను ఔటవుజ్‌లో ఉండేవాణ్ని. అప్పుడు నా ఫ్యామిలీ హీటర్ వేసుకునేవాళ్లు అని బ్రూనో చెప్పుకొచ్చాడు. నిపుణుల అంచనాల ప్రకారం కేవలం 4 శాతం మంది బ్రిటిషర్స్ మాత్రమే ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీతో బాధపడుతున్నారు. చూశారా.. పక్షులు, జంతువులే కాదు, వైఫై, రేడియేషన్ ప్రభావం వల్ల మనుషులు కూడా బాధపడతారు.

Tags:    

Similar News