ఒంటరి జీవితం గడపలేక చేయకూడని పనిచేసిన ఆర్మూర్ వ్యక్తి

దిశ, ఆర్మూర్: చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన కొండూరు స్వామి (45) ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై తాగిన మైకంలో ఆదివారం సాయంత్రం చెరువులో దూకాడు. నీటిలో మునిగిపోతూ తనను కాపాడాలంటూ చెరువు పక్కన దూరంగా వ్యవసాయ పొలాల్లో ఉన్నవారికి కేకలు వేసినా లాభం లేకపోయింది. వారు చెరువు దగ్గరకు చేరుకునేలోపే స్వామి గల్లంతయ్యాడు. […]

Update: 2021-11-16 07:16 GMT

దిశ, ఆర్మూర్: చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన కొండూరు స్వామి (45) ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై తాగిన మైకంలో ఆదివారం సాయంత్రం చెరువులో దూకాడు. నీటిలో మునిగిపోతూ తనను కాపాడాలంటూ చెరువు పక్కన దూరంగా వ్యవసాయ పొలాల్లో ఉన్నవారికి కేకలు వేసినా లాభం లేకపోయింది. వారు చెరువు దగ్గరకు చేరుకునేలోపే స్వామి గల్లంతయ్యాడు. జాలర్లు తెప్పలు, వలల సహాయంతో గాలించినా జాడ దొరకలేదు. చెరువు మధ్యలో ముళ్ల పొదలు అధికంగా ఉండడంతో కనీసం ఆనవాలు కనిపించలేదు. రెండు రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టిన జాలర్ల శ్రమ ఫలించి, మంగళవారం మృతదేహం లభించింది. మృతుడికి భార్యా పిల్లలు ఎవరూ లేరని గ్రామస్తులు తెలిపారు. ఒంటరి జీవితంపై విరక్తితో మద్యానికి బానిసయ్యాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై ఆనంద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూరు ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News