కొవిడ్ రిలీఫ్ లోన్‌తో లంబోర్ఘిని కారు.. జైలుపాలైన వ్యక్తి

దిశ, ఫీచర్స్: పాండమిక్ పరిస్థితుల్లో చిరు వ్యాపారస్తుల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు అందరూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపగా.. దివాళా తీసిన కంపెనీలను ఆదుకునేందుకు కోవిడ్ రిలీఫ్ పేరుతో ప్రభుత్వాలు రుణాలు సమకూరుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన లీ ప్రైస్ అనే వ్యక్తి.. కరోనా వైరస్ రిలీఫ్ లోన్‌గా పొందిన భారీ మొత్తంతో లంబోర్ఘిని కారుతో పాటు ఇతర విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశాడు. […]

Update: 2021-12-07 01:37 GMT

దిశ, ఫీచర్స్: పాండమిక్ పరిస్థితుల్లో చిరు వ్యాపారస్తుల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు అందరూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపగా.. దివాళా తీసిన కంపెనీలను ఆదుకునేందుకు కోవిడ్ రిలీఫ్ పేరుతో ప్రభుత్వాలు రుణాలు సమకూరుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన లీ ప్రైస్ అనే వ్యక్తి.. కరోనా వైరస్ రిలీఫ్ లోన్‌గా పొందిన భారీ మొత్తంతో లంబోర్ఘిని కారుతో పాటు ఇతర విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశాడు. విచారణలో ఈ విషయం బయటపడటంతో జైలు పాలయ్యాడు.

లీ ప్రైస్.. తన వ్యాపారానికి నిధులు అవసరమని పేర్కొంటూ US ప్రభుత్వం నుంచి 1.6 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12 కోట్లు) రుణం పొందాడు. పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) నుంచి అతడు ఈ డబ్బును అందుకున్నాడు. ఇది కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన వ్యక్తులు, వ్యాపారాలకు మద్దతిచ్చే లక్ష్యంతో గతేడాది అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది. ఈ ఫండ్ పొందేందుకుగాను లీ ప్రైస్ అనేక బ్యాంకులకు వివిధ PPP దరఖాస్తులను దాఖలు చేశాడు. చాలా మంది తనకు లోన్ ఇచ్చేందుకు నిరాకరించగా, కొన్ని బ్యాంకులు మాత్రం ఆమోదించాయి. ఇందుకోసం ‘ప్రైస్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో కంపెనీ కలిగి ఉన్నట్లు అప్లికేషన్‌లో తెలిపిన లీ.. సగటున నెలవారీ పేరోల్ $3,75,000తో 50 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు దరఖాస్తులో పేర్కొన్నాడు.

కానీ అధికారుల తనిఖీల్లో అసలు మోసం బయటపడింది. అతడు దరఖాస్తులో పేర్కొన్నట్లుగా కంపెనీలో ఉద్యోగులు లేదా ఆదాయం ఏమీ లేదని స్పష్టమైంది. అయితే తను ఇప్పటికే బ్యాంకుల నుంచి $ 9,37,500 రుణం అందుకోగా.. ఆ డబ్బుతో రోలెక్స్ వాచ్, లంబోర్ఘిని ఉరుస్, ఫోర్డ్ ఎఫ్-350 కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ మేరకు ప్రైస్ నుంచి $7,00,000 కంటే ఎక్కువే రికవరీ చేసిన అధికారులు అతనికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు.

Tags:    

Similar News