తాగి పట్టుబడి.. హైటెన్షన్ టవర్ ఎక్కి హల్ చల్

దిశ, వెబ్‌డెస్క్ : చెట్లు, పుట్టలు ఎక్కితే ఏం వెరటీ అనుకున్నాడేమో.. ఏకంగా హైటెన్షన్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడో వ్యక్తి. సాధారణంగా విద్యుత్ స్తంభాలను ముట్టుకోవాలన్నా, వైర్లను తాకాలన్న మనుషులు హడలిపోతారు. కానీ ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్లలో క్యాట్ వాక్ చేస్తూ ఉయ్యాల ఊగాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాగర్ గూడ బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లికి చెందిన నరేష్ నాగర్ గూడ బ్రిడ్జి […]

Update: 2021-03-10 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చెట్లు, పుట్టలు ఎక్కితే ఏం వెరటీ అనుకున్నాడేమో.. ఏకంగా హైటెన్షన్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడో వ్యక్తి. సాధారణంగా విద్యుత్ స్తంభాలను ముట్టుకోవాలన్నా, వైర్లను తాకాలన్న మనుషులు హడలిపోతారు. కానీ ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్లలో క్యాట్ వాక్ చేస్తూ ఉయ్యాల ఊగాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాగర్ గూడ బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లికి చెందిన నరేష్ నాగర్ గూడ బ్రిడ్జి సమీపంలో ఉన్న హైటెన్షన్ స్తంభాన్ని ఎక్కడాన్ని స్థానికులు గుర్తించారు. వాళ్లు పరుగున వెళ్లి అడ్డుకున్నా.. అతడు స్తంభాన్ని ఎక్కడాన్ని ఆపలేదు. వెంటనే స్థానికులు పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే హైటెన్షన్ స్తంభాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ వ్యక్తి హైటెన్షన్ స్తంభాన్ని ఎక్కి వైర్లపై నడిచాడు. వైర్లపై ఉయ్యాల ఊగాడు. గట్టిగా కేకలు వేస్తూ హల్ చల్ చేశాడు. పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని అతడిని కిందికి దించడానికి రెండు గంటలు శ్రమించారు.

అయితే నరేష్.. నాలుగు రోజుల క్రితం చేవెళ్లలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. మద్యం తాగి పోలీసులకు పట్టబడడంతో మనస్థాపానికి గురై హైటెన్షన్ టవర్ ఎక్కినట్లు తెలిసింది. స్థానికులు, పోలీసులు వారించడంతో నరేష్ టవర్ దిగాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News