కుక్కకు కేర్ టేకర్‌గా రోబో.. లక్నో ‘డ్రోన్ మ్యాన్’ క్రియేషన్

దిశ, ఫీచర్స్ : కొవిడ్ నుంచి మానవాళి రక్షణకు పలు రోబోలు రూపొందించబడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో పాటు వైరస్ టెస్టింగ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు రోబోలు సాయపడ్డాయి. ఇప్పటికి కూడా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇతర ఓపెన్ ప్లేసెస్‌లో థర్మల్ స్క్రీనింగ్‌ కోసం రోబోలను యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మానవుల కోసం కాకుండా ఓ జాగిలం కోసం ప్రత్యేకంగా రోబోను రూపొందించడం విశేషం. […]

Update: 2021-02-22 05:40 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ నుంచి మానవాళి రక్షణకు పలు రోబోలు రూపొందించబడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో పాటు వైరస్ టెస్టింగ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు రోబోలు సాయపడ్డాయి. ఇప్పటికి కూడా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇతర ఓపెన్ ప్లేసెస్‌లో థర్మల్ స్క్రీనింగ్‌ కోసం రోబోలను యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మానవుల కోసం కాకుండా ఓ జాగిలం కోసం ప్రత్యేకంగా రోబోను రూపొందించడం విశేషం.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన మిలింద్ రాజ్.. రోబో సైంటిస్ట్. ‘డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన ఈ సైంటిస్ట్, శానిటైజేషన్ కోసం రూపొందించిన డ్రోన్‌ను కొవిడ్ కట్టడికి ఉపయోగించారు. పాండమిక్ సమయంలో గోమతినగర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న జోజో అనే జాగిలాన్ని గుర్తించిన మిలింద్.. ట్రీట్‌మెంట్ కోసం దాన్ని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్.. శునకం మెంటల్ కండిషన్ సరిగా లేదని, మనుషులను చూస్తే కరుస్తుందని, దగ్గరకు రానివ్వదని వివరించాడు. దీంతో జాగిలం సంరక్షణ కోసం మిలింద్ ఓ రోబోను రూపొందించాడు. కళ్లు సరిగా కనిపించకపోవడంతో పాటు చెవులు కూడా వినిపించని ఈ డాగ్‌కు 7 నెలలుగా ఆ రోబోనే కేర్ టేకర్‌గా ఉంటోంది.

కాగా ప్రస్తుతం డాగ్ మెంటల్ కండిషన్ మెరుగైందని తెలిపిన మిలింద్.. మనుషులను చూసి భయపడుతున్న జాగిలం సంరక్షణ కోసమే తను స్పెషల్ ఇంటెలిజెంట్ రోబో తయారు చేశానని, ఈ విధంగా మానవాళికి, సాంకేతికతకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని మిలింద్ వివరించారు.

Tags:    

Similar News