కొవిడ్ రూల్స్ బ్రేక్.. మెగాస్టార్‌పై కేసు నమోదు

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిక్కుల్లో పడ్డారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మమ్ముట్టి.. కొవిడ్-19 ప్రోటోకాల్ అతిక్రమించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 3వ తేదీన ఆస్పత్రికి వచ్చినప్పుడు బయట చాలామంది జనం పోగవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి కోజికోడ్‌లోని ఎలత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు అందింది. దీంతో హాస్పిటల్ అథారిటీస్, నటులు మమ్ముట్టి, రమేష్ పిషారోడితో పాటు మరో 300 మందిపై […]

Update: 2021-08-08 06:06 GMT

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిక్కుల్లో పడ్డారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మమ్ముట్టి.. కొవిడ్-19 ప్రోటోకాల్ అతిక్రమించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 3వ తేదీన ఆస్పత్రికి వచ్చినప్పుడు బయట చాలామంది జనం పోగవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి కోజికోడ్‌లోని ఎలత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు అందింది. దీంతో హాస్పిటల్ అథారిటీస్, నటులు మమ్ముట్టి, రమేష్ పిషారోడితో పాటు మరో 300 మందిపై కేరళ ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్, 2021లోని సెక్షన్లు 4,5,6 కింద కేసు నమోదు చేశారు.

కాగా ఆస్పత్రి లోపల అన్ని రకాల ప్రోటోకాల్ పాటించామని తెలిపిన హాస్పిటల్ అథారిటీస్.. జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ కోసం ఏర్పాటు చేసిన రోబో అసిస్టెడ్ సర్వీస్ ప్రారంభించేందుకు మమ్ముట్టి వచ్చారని పేర్కొన్నారు. కానీ ఆయన ఈ ప్రోగ్రామ్ ముగించుకుని బయటికొచ్చేసరికి వందలాది జనం గుమిగూడారని చెప్పారు. వారిలో చాలామందికి మాస్క్‌లు లేకపోవడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించలేదనే విషయం ఫొటోలు, వీడియోల ద్వారా స్పష్టమైందని వెల్లడించారు.

Tags:    

Similar News