హుజురాబాద్ ఫలితాల వేళ హరీష్‌కు షాక్.. పట్టించుకోని ఆ గ్రామ ప్రజలు
దిశ, వీణవంక: మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి స్వగ్రామమైన మామిడాల పల్లి గ్రామాన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఇస్తే దత్తత తీసుకుంటానంటూ హామీ ఇచ్చిన విషయం విధితమే. కానీ గ్రామ ప్రజలు మంత్రి మాటలను బేఖాతరు చేసి మరో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మెజారిటీ ఇవ్వడం గమనార్హం. గ్రామంలో మొత్తం 3022 ఓట్లకు గాను 2682 ఓట్లు పోలయ్యాయి. […]
దిశ, వీణవంక: మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి స్వగ్రామమైన మామిడాల పల్లి గ్రామాన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఇస్తే దత్తత తీసుకుంటానంటూ హామీ ఇచ్చిన విషయం విధితమే. కానీ గ్రామ ప్రజలు మంత్రి మాటలను బేఖాతరు చేసి మరో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మెజారిటీ ఇవ్వడం గమనార్హం. గ్రామంలో మొత్తం 3022 ఓట్లకు గాను 2682 ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో బీజేపీకి 1190 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 1037 ఓట్లు, కాంగ్రెస్ కి 48 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రాకపోవడంతో మామిడాల గ్రామాన్ని హరీష్ రావు దత్తత తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.