ఆయన ఓ విధ్వంసకారుడు: మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీని దేశంలోని అతిపెద్ద విధ్వంసకారుడిగా పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరలో ఎదుర్కొన్న పరిణామాల కన్నా తీవ్రమైన పరిస్థితులను మోడీ ఎదుర్కొంటారని అన్నారు. హింస నుంచి ఏమీ సాధించలేరని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ పన్ను వసూళ్ల పార్టీ అని బీజేపీ ఆరోపిస్తున్నదని, నిజానికి వారే విధ్వంసకారులని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను […]

Update: 2021-02-24 07:17 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీని దేశంలోని అతిపెద్ద విధ్వంసకారుడిగా పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరలో ఎదుర్కొన్న పరిణామాల కన్నా తీవ్రమైన పరిస్థితులను మోడీ ఎదుర్కొంటారని అన్నారు. హింస నుంచి ఏమీ సాధించలేరని ఉద్ఘాటించారు.

తృణమూల్ కాంగ్రెస్ పన్ను వసూళ్ల పార్టీ అని బీజేపీ ఆరోపిస్తున్నదని, నిజానికి వారే విధ్వంసకారులని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను గోల్ కీపర్ అని పేర్కొన్నారు. బీజేపీ ఒక్క గోల్ కూడా చేయబోదని అన్నారు. వారి గోల్స్ అన్నీ గోల్‌పోస్టు పై నుంచి వెళ్లిపోతాయని తెలిపారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యను సీబీఐ దర్యాప్తు చేయడాన్ని ఖండించారు. సీబీఐ చర్య బెంగాలీ మహిళలకు అవమానమని పేర్కొన్నారు.

Tags:    

Similar News