'సెకండ్ వేవ్ విజృంభణకు మోడీనే కారణం'
కోల్‌కతా: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు ప్రధాని నరేంద్రమోడీనే కారణమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా కరోనాను నిలువరించే ప్రణాళికలు ఎందుకు చేయలేదని, దీనికి సమాధానమివ్వాలని ప్రధానిపై దీదీ విరుచుకుపడ్డారు. ‘కరోనా కేసులు దూసుకుపోతున్నాయి. అందుకు బాధ్యత వహిస్తూ పీఎం రాజీనామా చేయాలి. ఈ వైఫల్యానికి పూర్తిగా ఆయనదే బాధ్యత. కరోనాను నిలువరించే ప్రణాళిక చేయలేదు. ఇతరులనూ చేయనివ్వలేదు’ అని ఆరోపించారు. […]
కోల్‌కతా: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు ప్రధాని నరేంద్రమోడీనే కారణమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా కరోనాను నిలువరించే ప్రణాళికలు ఎందుకు చేయలేదని, దీనికి సమాధానమివ్వాలని ప్రధానిపై దీదీ విరుచుకుపడ్డారు. ‘కరోనా కేసులు దూసుకుపోతున్నాయి. అందుకు బాధ్యత వహిస్తూ పీఎం రాజీనామా చేయాలి. ఈ వైఫల్యానికి పూర్తిగా ఆయనదే బాధ్యత. కరోనాను నిలువరించే ప్రణాళిక చేయలేదు. ఇతరులనూ చేయనివ్వలేదు’ అని ఆరోపించారు.
సరైన సమయానికి ప్రధాని స్పందించి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని అన్నారు. కరోనా మహమ్మారి తాండవిస్తున్నందున ఎన్నికల విడతను తగ్గించాలని మరోమారు ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు. మిగిలిన మూడు విడతలను ఒకే విడతగా కుదించి, ఒకటి లేదా రెండు రోజుల్లో పోలింగ్ ముగించాలని, ప్రజల జీవితాలను ఆడుకోవద్దని చేతులెత్తి ఈసీని వేడుకుంటున్నానని అన్నారు. బీజేపీ సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని పేర్కొన్నారు.