కాలికి గాయం.. నాపై దాడి చేశారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. బుధవారం ఆమె నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో కారు నుంచి దిగుతుండగా తనపై దాడి జరిగినట్టు ఆమె ఆరోపించారు. కాలికి గాయం కావడంతో ఆమె హుటాహుటిన కోల్‌కతా బయలుదేరి చికిత్స పొందుతున్నారు. ఇదే విషయమై ఆమె మాట్లాడుతూ.. కారు దిగుతున్న సమయంలో తనను నలుగురైదుగురు తోసేశారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో పోలీసులెవరూ అక్కడ లేరని తెలిపారు. దీని వెనక కుట్ర ఉన్నదనీ.. ‘చూడండి.. […]

Update: 2021-03-10 10:07 GMT

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. బుధవారం ఆమె నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో కారు నుంచి దిగుతుండగా తనపై దాడి జరిగినట్టు ఆమె ఆరోపించారు. కాలికి గాయం కావడంతో ఆమె హుటాహుటిన కోల్‌కతా బయలుదేరి చికిత్స పొందుతున్నారు. ఇదే విషయమై ఆమె మాట్లాడుతూ.. కారు దిగుతున్న సమయంలో తనను నలుగురైదుగురు తోసేశారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో పోలీసులెవరూ అక్కడ లేరని తెలిపారు. దీని వెనక కుట్ర ఉన్నదనీ.. ‘చూడండి.. కాలు ఎలా వాచిపోయిందో.. ఇది కుట్ర కాదా’ అంటూ ఆమె ఆరోపణలు చేయడం గమనార్హం. 1991లో కూడా దీదీపై ఇదే తరహా దాడి జరిగింది. ఆ ఘటనలో అప్పటి అధికార సీపీఎం కార్యకర్తలు పలువురు ఆమెపై దాడికి దిగారు.

కాగా ప్రస్తుత ఘటనపై బీజేపీ స్పందించింది. అదంతా డ్రామా అని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే ఆమె ఈ డ్రామాలకు తెరలేపారని మండిపడింది. ఇదిలాఉండగా మమతపై దాడి ఘటనపై ఈసీ సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

 

Tags:    

Similar News