నందిగ్రామ్‌లో దీదీ పాదయాత్ర
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో తొలిసారి పాదయాత్ర చేపట్టారు. వీల్‌చైర్‌పై కూర్చుని పాదయాత్ర చేశారు. నందిగ్రామ్ బ్లాక్-2లోని ఖుదీరామ్ మోడ్ నుంచి ఠాకూర్ చౌక్ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో మద్దతుదారులు భారీగా హాజరయ్యారు. పార్టీ జెండా పట్టుకుని ఆమెను అనుసరించారు. బెంగాల్‌లో తొలి విడత ఎన్నికలు ముగిసన సంగతి తెలిసిందే. రెండో విడతలో భాగంగా దీదీ స్వయంగా పోటీ చేస్తున్న నందిగ్రామ్‌కూ పోలింగ్ జరగనుంది. […]
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో తొలిసారి పాదయాత్ర చేపట్టారు. వీల్‌చైర్‌పై కూర్చుని పాదయాత్ర చేశారు. నందిగ్రామ్ బ్లాక్-2లోని ఖుదీరామ్ మోడ్ నుంచి ఠాకూర్ చౌక్ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో మద్దతుదారులు భారీగా హాజరయ్యారు. పార్టీ జెండా పట్టుకుని ఆమెను అనుసరించారు.
బెంగాల్‌లో తొలి విడత ఎన్నికలు ముగిసన సంగతి తెలిసిందే. రెండో విడతలో భాగంగా దీదీ స్వయంగా పోటీ చేస్తున్న నందిగ్రామ్‌కూ పోలింగ్ జరగనుంది. ఈ స్థానం నుంచి టీఎంసీ మాజీ నేత సువేందు అధికారి బీజేపీ టికెట్‌తో దీదీ పై పోటీ చేస్తున్నారు. రెండో విడతలో నందిగ్రామ్ కేంద్రస్థానంలో ఉండనుంది. గతనెలలో నందిగ్రామ్‌లో మమతకు కాలి గాయం తర్వాత మళ్లీ ఈ రోజే ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పాదయాత్ర తర్వాత జనసభ బోయల్‌లో సభలో మాట్లాడనున్నారు. తర్వాత అందాబాద్ హైస్కూ్ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో మధ్యాహ్నం 2.00 నుంచి 3.30 వరకు పాల్గొననున్నారు.
సువేందు అధికారి తరఫున క్యాంపెయిన్ ఉధృతమవనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఈ నియోజకవర్గంలో అధికారి కోసం ప్రచారం చేయనున్నారు. బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి కూడా ఇక్కడ ప్రచారం చేస్తారు. మమతా బెనర్జీని 50వేల ఓట్లతో ఓడిస్తానని సువేందు అధికారి ఇప్పటికే ప్రకటించారు.