‘కరోనా కట్టడి వదిలి.. ఎన్నికలపై ఫోకస్’
కోల్‌కతా: ఆరు నెలలుగా కరోనా కట్టడికి కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మోడీ సర్కార్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండి పడ్డారు. ఈ ఆరు నెలల పాటు కేవలం బెంగాల్ పర్యటనలకే కేంద్రమంత్రులు పరిమితమయ్యారని అన్నారు. బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశతో దేశాన్నే ప్రమాదకర స్థితిలోకి నెట్టారని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిమాన్ బందోపాధ్యాయ శనివారం అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో కేంద్రంపై ఆమె విరుచుకుపడ్డారు. ‘నేను చాలెంజ్ చేసి […]
కోల్‌కతా: ఆరు నెలలుగా కరోనా కట్టడికి కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మోడీ సర్కార్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండి పడ్డారు. ఈ ఆరు నెలల పాటు కేవలం బెంగాల్ పర్యటనలకే కేంద్రమంత్రులు పరిమితమయ్యారని అన్నారు. బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశతో దేశాన్నే ప్రమాదకర స్థితిలోకి నెట్టారని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిమాన్ బందోపాధ్యాయ శనివారం అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో కేంద్రంపై ఆమె విరుచుకుపడ్డారు. ‘నేను చాలెంజ్ చేసి చెబుతున్నాను..వారికి(బీజేపీకి) ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా సహకరించి ఉండకపోయుంటే వారికి ఆ 30 సీట్లు కూడా వచ్చి వుండేవి కాదు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఎన్నికల అధికారుల పర్యవేక్షణలోనే రిగ్గింగ్ జరిగింది’ అని అన్నారు.
‘వాళ్లు(బీజేపీ) ఇప్పుడు ప్రజా తీర్పును అంగీకరించడం లేదు. అందుకే ఫేక్ వీడియోలు పోస్టు చేసి రాష్ట్రంలో హింసను రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. ఈ మేరకు హింసను రేకెత్తించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.‘ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోకుండానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అందుకే రాష్ట్రంలో ప్రస్తుతం ఇన్ ఫెక్షన్ పెరిగిపోయింది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో పడి దేశాన్ని ప్రమాదపుటంచుల్లోకి కేంద్రం నెట్టింది. గడిచిన ఆరు నెలల్లో కేంద్రం ఎలాంటి అభివృద్ది పనులు చేయలేదనీ.. వారి దృష్టంతా బెంగాల్‌ను చేజిక్కించుకోవటంపైనే ఉంది. అందుకే కేంద్ర మంత్రులు బెంగాల్‌లో తిష్ట వేశారని’ మండి పడ్డారు.