ఓవైసీపై దీదీ ఫైర్.. బీజేపీతో కుమ్మక్కై..

కోల్‌కతా: దేశం దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ ఎన్నికల సంగ్రామంలో గెలుపుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు. అక్కడ తన గెలుపు లాంఛనమేనని అన్నారు. నందిగ్రామ్‌లో తాను గెలుస్తానని కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దీదీ ఒక్కరే గెలిస్తే సరిపోదని అని మిగతా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కూచ్‌బెహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘నందిగ్రామ్‌లో గెలుస్తానని నాకు తెలుసు. కానీ నేనొక్కదానినే గెలిస్తే సరిపోదు. […]

Update: 2021-04-02 05:21 GMT

కోల్‌కతా: దేశం దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ ఎన్నికల సంగ్రామంలో గెలుపుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు. అక్కడ తన గెలుపు లాంఛనమేనని అన్నారు. నందిగ్రామ్‌లో తాను గెలుస్తానని కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దీదీ ఒక్కరే గెలిస్తే సరిపోదని అని మిగతా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కూచ్‌బెహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘నందిగ్రామ్‌లో గెలుస్తానని నాకు తెలుసు. కానీ నేనొక్కదానినే గెలిస్తే సరిపోదు. రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నాతో పాటు మరో 200 మందిని అభ్యర్థులను కూడా గెలిపించాలి. అందుకే మీ ఓటు (ప్రజలను ఉద్దేశిస్తూ) టీఎంసీకి వేయండి’ అంటూ అభ్యర్థించారు.

ఇదే సభలో హైదరాబాద్ ఎంపీ, ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై మమతా బెనర్జీ విమర్శలు సంధించారు. ఆయన బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని హిందూ ముస్లిం ఓటర్ల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. ‘హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, హుగ్లీ లో మరో వ్యక్తి (అబ్బాస్ సిద్ధిఖీ-ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నాయకుడు) ఇక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. కానీ ఎన్ని డబ్బులు పంచినా వారి ఆటలు చెల్లవు’ అని విమర్శించారు.

Tags:    

Similar News