రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ నామినేట్ చేసింది. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఖర్గే ఎంపికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యవహారాలకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుల్బర్గా నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ నెల 19న రాజ్యసభ పోలింగ్ […]

Update: 2020-06-05 08:51 GMT

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ నామినేట్ చేసింది. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఖర్గే ఎంపికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యవహారాలకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుల్బర్గా నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ నెల 19న రాజ్యసభ పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News