హీరోల గర్ల్‌ఫ్రెండ్స్ వల్ల చాలా కోల్పోయా : నటి
దిశ, సినిమా : యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నాడంటూ బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ సైతం తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ఓపెన్ అయింది. ఇండస్ట్రీకి చెందిన హీరోల గర్ల్‌ఫ్రెండ్స్, మేన కోడళ్లు లేదా కుమార్తెల వల్ల […]
దిశ, సినిమా : యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నాడంటూ బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ సైతం తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ఓపెన్ అయింది. ఇండస్ట్రీకి చెందిన హీరోల గర్ల్‌ఫ్రెండ్స్, మేన కోడళ్లు లేదా కుమార్తెల వల్ల చాలా చిత్రాల్లో చాన్స్‌లు కోల్పోయానని, ఈ పద్ధతి మారే అవకాశం కనిపించడం లేదని తెలిపింది. కానీ తాను మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సొంత మార్గంలో తనకు రావల్సిన పాత్రల్ని పొందుతున్నాని చెప్పింది.
ఇక బోల్డ్ సీన్స్ చేయడం వల్ల ఎప్పుడూ ఫిమేల్ యాక్టర్స్ మాత్రమే టార్గెట్ చేయబడటంపై స్పందించిన మల్లిక.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుందని అభిప్రాయపడింది. అయితే గతంలో కంటే పరిస్థితిలో మార్పు కనబడుతోందని.. ప్రస్తుతం మీడియా మహిళలకు చాలా మద్దతిస్తోందని తెలిపింది. సమాజం కూడా అభివృద్ధి చెందిందని, ఇప్పుడు యాక్టర్స్ ‘ఫ్రంటల్ న్యూడిటీ’ని నిర్భయంగా చేస్తుండగా.. ఇది అంగీకరించబడటంతో పాటు చాలా కళాత్మకంగా పరిగణించబడుతోందని ఆమె వివరించింది.