ఆ సముద్ర జలాల్లో చైనాకు హక్కులేదు : మలేషియా
దిశ, వెబ్‌డెస్క్ : డ్రాగన్ కంట్రీ రాజ్య విస్తరణ కాంక్షతో తన పొరుగునున్న దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పిటికే చైనా చుట్టు ఉన్న దేశాలన్నీ డ్రాగన్ పై బుసలు కొడుతుండగా, తాజాగా మలేషియా కూడా చైనా దుశ్చర్యలను ఎండగట్టింది. దక్షిణ చైనా సముద్రంలో తమకు హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనను మలేషియా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ పార్లమెంటులో మాట్లాడుతూ.. దక్షిణ చైనా సముద్రంలో తమకు చారిత్రక హక్కులు […]
దిశ, వెబ్‌డెస్క్ : డ్రాగన్ కంట్రీ రాజ్య విస్తరణ కాంక్షతో తన పొరుగునున్న దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పిటికే చైనా చుట్టు ఉన్న దేశాలన్నీ డ్రాగన్ పై బుసలు కొడుతుండగా, తాజాగా మలేషియా కూడా చైనా దుశ్చర్యలను ఎండగట్టింది. దక్షిణ చైనా సముద్రంలో తమకు హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనను మలేషియా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ పార్లమెంటులో మాట్లాడుతూ.. దక్షిణ చైనా సముద్రంలో తమకు చారిత్రక హక్కులు ఉన్నాయని చైనా చేస్తున్న వాదనను మలేషియా వ్యతిరేకిస్తోందన్నారు. అయితే, మలేషియా చైనా దేశాలు వాణిజ్య పరంగా మిత్రదేశాలు.
పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు హిషాముద్దీన్ హుస్సేన్ బదులిస్తూ.. దక్షిణ చైనా సముద్రంలో మారిటైమ్ ఫీచర్స్‌పై హక్కులున్నాయని చైనా చేస్తున్న వాదనకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎటువంటి ఆధారం లేదని కొట్టిపారేసింది. మలేసియా ప్రబుత్వం చైనాపై బహిరంగంగా విరుచుకుపడటం ఇదే మొదటిసారి.
ఈ రెండు దేశాలు వ్యాపారపరంగా మిత్రుత్వం సాగిస్తున్నాయి. చైనాతో సత్సంబంధాల కోసం మలేషియా ఇన్నిరోజులు మొగ్గు చూపుతూ వచ్చింది. దాన్ని అడ్డంపెట్టుకుని 2016 నుంచి 2019 మధ్య కాలంలో మలేసియా ప్రత్యేక ఆర్థిక మండలిలోకి చైనా నౌకలు 89 సార్లు అక్రమంగా ప్రవేశించినట్లు ఇటీవల మలేసియా ప్రభుత్వం గుర్తించింది. మలేసియా జలాల్లో 100 రోజులపాటు చైనా నౌకలు చొరబడినట్లు నిర్దారణ అయ్యింది.దీంతో మలేషియా దౌత్యపరంగా ఎన్నోమార్లు చర్చలు జరపగా, చైనీస్ నౌకలు వెనుదిరిగాయి. ఇన్నిరోజులు చైనా చేస్తున్న ఆగడాలపై సైలంట్‌గా ఉన్న మలేషియా మొదటిసారి తన నిరసన తెలపడంతో చైనా ఎలా స్పందింస్తుందో వేచిచూడాలి.