పాలిస్తున్న మేకపోతు
దిశ, వెబ్ డెస్క్: ఎక్కడైనా ఆవు, గెదే, మేక పాలు ఇవ్వడం సాధారణం. అయితే మేకపోతు కూడా పాలు ఇస్తుందంటా! ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నిజంగానే పాలిస్తుంది. ఈ వింత ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. ఢోల్‌పూర్‌లోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుశ్వాహ ఓ మగ మేకను పెంచుకుంటున్నాడు. అది పాలిస్తుందని గ్రహించి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆయన మాటల్లోనే.. “మేకపోతును రెండున్నర నెలల వయసు ఉన్నప్పుటి నుంచి పెంచుకుంటున్నాం. ఆరు నెలల వయసొచ్చేసరికి మేకపోతుకు పొదుగులు వచ్చాయి. […]
దిశ, వెబ్ డెస్క్: ఎక్కడైనా ఆవు, గెదే, మేక పాలు ఇవ్వడం సాధారణం. అయితే మేకపోతు కూడా పాలు ఇస్తుందంటా! ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నిజంగానే పాలిస్తుంది. ఈ వింత ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. ఢోల్‌పూర్‌లోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుశ్వాహ ఓ మగ మేకను పెంచుకుంటున్నాడు.
అది పాలిస్తుందని గ్రహించి ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఆయన మాటల్లోనే.. “మేకపోతును రెండున్నర నెలల వయసు ఉన్నప్పుటి నుంచి పెంచుకుంటున్నాం. ఆరు నెలల వయసొచ్చేసరికి మేకపోతుకు పొదుగులు వచ్చాయి. ప్రస్తుతం రోజుకు 200- 250 గ్రాముల పాలను ఇస్తుంది.” అని దాని యజమాని తెలిపారు. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్లే ఇలా జరుగుతుందని, ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి వెలుగు చూస్తాయని వెటర్నటీ సర్జన్ జ్ఞాన్ ప్రకాశ్ సక్సేనా వెల్లడించారు.