ఆడమగ ఇద్దరూ ధరించే ‘కండోమ్’.. రూపొందించిన గైనకాలజిస్ట్

దిశ, ఫీచర్స్ : మలేషియాకు చెందిన గైనకాలజిస్ట్ జాన్ టాంగ్ ఇంగ్ చిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి యునిసెక్స్ కండోమ్‌ని రూపొందించాడు. సాధారణంగా గాయాలకు డ్రెస్సింగ్‌గా ఉపయోగించే మెడికల్ గ్రేడ్ మెటీరియల్‌తో తయారుచేసిన దీన్ని.. ఆడ లేదా మగ ఎవరైనా ధరించవచ్చు. ఈ కండోమ్‌లను పాలియురేతేన్‌ను ఉపయోగించి తయారు చేయగా.. చూడ్డానికి సన్నగా ఉన్న ఎంతో దృఢమైనది. అంతేకాదు ఇది వాటర్ ప్రూఫ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కండోమ్ చాలా లైట్‌వెయిట్‌తో ఉండటం వల్ల ధరించినట్లే ఉండదని […]

Update: 2021-10-29 05:48 GMT

దిశ, ఫీచర్స్ : మలేషియాకు చెందిన గైనకాలజిస్ట్ జాన్ టాంగ్ ఇంగ్ చిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి యునిసెక్స్ కండోమ్‌ని రూపొందించాడు. సాధారణంగా గాయాలకు డ్రెస్సింగ్‌గా ఉపయోగించే మెడికల్ గ్రేడ్ మెటీరియల్‌తో తయారుచేసిన దీన్ని.. ఆడ లేదా మగ ఎవరైనా ధరించవచ్చు.

ఈ కండోమ్‌లను పాలియురేతేన్‌ను ఉపయోగించి తయారు చేయగా.. చూడ్డానికి సన్నగా ఉన్న ఎంతో దృఢమైనది. అంతేకాదు ఇది వాటర్ ప్రూఫ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కండోమ్ చాలా లైట్‌వెయిట్‌తో ఉండటం వల్ల ధరించినట్లే ఉండదని మేకర్స్ తెలిపారు. అనేక క్లినికల్ రీసెర్చ్, టెస్టింగ్‌ల తర్వాతే ఫైనల్ ప్రొడక్ట్ రూపొందించామని, డిసెంబర్‌లో కంపెనీ వెబ్‌సైట్ ‘Twin Catalyst’ ద్వారా వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొస్తామని గైనకాలజిస్ట్ టాంగ్ తెలిపారు. యోని లేదా పురుషాంగానికి అంటుకునే కవరింగ్‌తో కూడిన కండోమ్ ధర 14.99 రింగ్‌గిట్ ($3.61) కాగా.. ప్రతి బాక్స్‌లో రెండు కండోమ్‌లు ఉంటాయి. ఇక మలేషియాలో డజను కండోమ్‌ల సగటు ధర 20-40 రింగ్‌గిట్‌లు కావడం విశేషం.

Wondaleaf Unisex కండోమ్ వారి లైంగిక ధోరణితో సంబంధం లేకుండా, లైంగిక ఆరోగ్యంపై మెరుగైన నియంత్రణ ఉండేలా ప్రజలను శక్తివంతం చేస్తుంది. అనాలోచిత గర్భాలు, గర్భనిరోధక పద్ధతులు, లైంగికంగా సంక్రమించే వ్యాధుల నివారణకు ఇది ఒక అర్ధవంతమైన ఆల్టర్నేటివ్.
– గైనకాలజిస్ట్ టాంగ్

 

Tags:    

Similar News