మరో క్రేజీ చాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్
సెన్సేషనల్ హీరోయిన్ ‘మాళవిక మోహనన్’ మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది. మలయాళంలో సూపర్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ భామ.. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోనూ అదే రేంజ్‌లో దూసుకుపోవాలని ట్రై చేస్తోంది. ఇప్పటికే ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో నటించిన అమ్మడు.. ఇప్పుడు మరో స్టార్ హీరోతో జోడీ కట్టనుంది. మాస్ హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయబోతోందని కోలీవుడ్ టాక్. యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో ధనుష్ 43వ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ చిత్రంలో మాళవికను […]
సెన్సేషనల్ హీరోయిన్ ‘మాళవిక మోహనన్’ మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది. మలయాళంలో సూపర్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ భామ.. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోనూ అదే రేంజ్‌లో దూసుకుపోవాలని ట్రై చేస్తోంది. ఇప్పటికే ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో నటించిన అమ్మడు.. ఇప్పుడు మరో స్టార్ హీరోతో జోడీ కట్టనుంది. మాస్ హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయబోతోందని కోలీవుడ్ టాక్.
యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో ధనుష్ 43వ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ చిత్రంలో మాళవికను ఫైనల్ చేసినట్లు సమాచారం. ధనుష్ పుట్టినరోజున మాళవిక విష్ చేయడంతో పాటు మీతో వర్క్ చేసేందుకు ఎగ్జైంటింగ్‌గా ఎదురుచూస్తున్నానని తెలిపింది. దీనికి రిప్లై ఇచ్చిన ధనుష్.. థాంక్స్ చెప్పి, నేను కూడా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. దీంతో ఈ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుందంటున్న ధనుష్ ఫ్యాన్స్.. అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నారు. కాగా ధనుష్ నటించిన ‘జగమే తందిరం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.