79 శాతం క్షీణించిన మహీంద్రా వాహన విక్రయాలు!
దిశ, సెంట్రల్ డెస్క్: మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు మే నెలలో భారీగా తగ్గాయి. మొత్తం అమ్మకాలు 79 శాతం క్షీణతతో 9560 యూనిట్లుగా నమోదయ్యాయి. వీటిలో దేశీయ అమ్మకాల వాటా 9076 యూనిట్లతో 79శాతం క్షీణత అని తెలిపింది. మొత్తం ఎగుమతులు కూడా 80 శాతం తగ్గి 484 యూనిట్లకు పరిమితమయ్యాయని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 81 శాతం క్షీణతతో 3,867 యూనిట్లుగా నమోదయ్యాయి. వ్యవసాయ పరికరాల అమ్మకాలు 24,704 యూనిట్లుగా నమోదయ్యాయి. వీటిలో […]
దిశ, సెంట్రల్ డెస్క్: మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు మే నెలలో భారీగా తగ్గాయి. మొత్తం అమ్మకాలు 79 శాతం క్షీణతతో 9560 యూనిట్లుగా నమోదయ్యాయి. వీటిలో దేశీయ అమ్మకాల వాటా 9076 యూనిట్లతో 79శాతం క్షీణత అని తెలిపింది. మొత్తం ఎగుమతులు కూడా 80 శాతం తగ్గి 484 యూనిట్లకు పరిమితమయ్యాయని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 81 శాతం క్షీణతతో 3,867 యూనిట్లుగా నమోదయ్యాయి. వ్యవసాయ పరికరాల అమ్మకాలు 24,704 యూనిట్లుగా నమోదయ్యాయి. వీటిలో దేశీయ వ్యవసాయ పరికరాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇక, మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల విక్రయాలు మే నెలలో 1 శాతం తగ్గి 24,341 యూనిట్లుగా నమోదైనట్టు సోమవారం కంపెనీ ప్రకటించింది. గతేడాది మేలో 24,704 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దేశీయంగా ట్రాక్టర్ల విక్రయాలు స్థిరంగా ఉన్నాయి. గతేడాది 23,539 యూనిట్ల విక్రయాలు జరగ్గా ప్రస్తుతం 24,017 యూనిట్లుగా నమోదైనట్టు వెల్లడించింది. ట్రాక్టర్ ఎగుమతులు 72 శాతం క్షీణించి 324 యూనిట్లుగా నమోదయ్యాయి. గత మేలో ఈ ఎగుమతులు 1,165 యూనిట్లు అని తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయ రంగానికి కొంతవరకు సడలింపులు ఇవ్వడంతో మే నెలలో ట్రాక్టర్లకు భారీగా డిమాండ్ పెరిగిందని ఎంఅండ్‌ఎం లిమిటెడ్ ప్రెసిడెంట్ హేమంత్ వివరించారు. రబీ పంటల ఉత్పత్తి, సకాలంలో రుతపవనాల ఆగమనంతో ఖరీప్ పంటలకు మంచి దిగుబడి రావడంతో ట్రాక్టర్లకు డిమాండ్ బావుంటుందని ఆయన పేర్కొన్నారు.