మహీంద్రా నుంచి 13 కొత్త మోడళ్లు.. వాటిలో 5 ఎలక్ట్రిక్‌వే..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మంగళవారం కీలక ప్రకటన చేసింది. 2027 నాటికి సంస్థ 13 కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. వీటిలో 8 వాహనాలు ఎలక్ట్రిక్ విభాగంలో వస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ, థార్ మోడల్ వాహనాలు తమ ప్రధాన విభాగాలని కంపెనీ అభిప్రాయపడింది. ఇవి ప్రధాన బ్రాండ్లుగా ఉన్నప్పటికీ, ఇతర బ్రాండ్లను సైతం కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మంగళవారం కీలక ప్రకటన చేసింది. 2027 నాటికి సంస్థ 13 కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. వీటిలో 8 వాహనాలు ఎలక్ట్రిక్ విభాగంలో వస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ, థార్ మోడల్ వాహనాలు తమ ప్రధాన విభాగాలని కంపెనీ అభిప్రాయపడింది. ఇవి ప్రధాన బ్రాండ్లుగా ఉన్నప్పటికీ, ఇతర బ్రాండ్లను సైతం కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి వివిధ దశలలో ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)తో కూడిన బ్రాండ్ల ద్వారా పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టంగా ఉండనుంది. సంస్థ ఇప్పటికే ఉన్న నాలుగింటిని అప్‌గ్రేడ్ చేసి, కొత్తగా మరో నాలుగు ఈవీ ఎస్‌యూవీలను తీసుకురానున్నట్టు కంపెనీ ఆటోమోటివ్ విభాగం రాజేష్ చెప్పారు. 2027 నాటికి మొత్తం ఎస్‌యూవీ విభాగంలో కనీసం 20 శాతం ఈవీలు ఉండాలని భావిస్తున్నాం. చార్జింగ్ మౌలిక సదుపాయాలను బట్టి వీటి ఉత్పత్తి ఉంటుందని రాజేష్ వివరించారు. ఈవీల కోసం కంపెనీ రూ.3,000 కోట్ల పెట్టుబడులను కేటాయించింది. ఇవి కాకుండా గత 20 ఏళ్లలో ఈ విభాగంలో పెట్టుబడులను స్థిరంగా కొనసాగిస్తున్నామని కంపెని ఎండీ, సీఈఓ అనిష్ షా చెప్పారు.
త్వరలో రాబోయే తమ కొత్త మోడళ్లతో తిరిగి మార్కెట్లో మరింత పట్టు సాధిస్తామని అనిష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మంగళవారం ఎంఅండ్ఎం కంపెనీ 2021-22, సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం అత్యధికంగా రూ.1,432 కోట్లతో ఎనిమిది రెట్లు పెరిగిందని తెలిపింది. గతేడాది ఇదే సమయంలో కంపెని రూ.162 కోట్ల లాభాలను ప్రకటించింది. సమీక్షించిన త్రైమాసికంలో నిర్వహణ లాభం 15 శాతం పెరిగి రూ.13,305 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది.