పారిశుధ్య కార్మికులకు మహేష్ థాంక్స్
కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుండి పోరాడుతోంది ముగ్గురు హీరోలు. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు. వారి సేవలకు జీవితాంతం రుణపడి ఉంటామని… వారి త్యాగాలకు సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇంతకు ముందే డాక్టర్లు, పోలీసుల త్యాగనిరతిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. వారిని రియల్ హీరోలుగా భావిస్తూ సెల్యూట్ చేశారు. ఇప్పుడు మరో హీరో అయిన పారిశుధ్య కార్మికుడికి సలాం చేస్తున్నాడు ప్రిన్స్. This one is for all […]
కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుండి పోరాడుతోంది ముగ్గురు హీరోలు. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు. వారి సేవలకు జీవితాంతం రుణపడి ఉంటామని… వారి త్యాగాలకు సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇంతకు ముందే డాక్టర్లు, పోలీసుల త్యాగనిరతిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. వారిని రియల్ హీరోలుగా భావిస్తూ సెల్యూట్ చేశారు. ఇప్పుడు మరో హీరో అయిన పారిశుధ్య కార్మికుడికి సలాం చేస్తున్నాడు ప్రిన్స్.
This one is for all the sanitation workers deployed on our streets to make sure the surroundings are kept clean and sanitised. While we are safe in our homes, they come out everyday leaving their own to ensure we remain out of harm’s way… pic.twitter.com/P26e9t4kzc
— Mahesh Babu (@urstrulyMahesh) April 16, 2020
మన వీధుల్లోకి వచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ… శానిటైజ్ చేస్తున్న ప్రతీ వర్కర్ కు థాంక్స్ చెప్పారు మహేష్. మనం మన ఇళ్లలో సురక్షితంగా ఉంటే.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వారి ఇంటినుంచి బయటకు వచ్చి మనకోసం ప్రతీ రోజూ పనిచేస్తున్నారని తెలిపాడు. కరోనా వైరస్ తో నిరంతర యుద్ధం చేస్తున్నారన్నాడు. ఇలాంటి పారిశుధ్య కార్మికుల పట్ల ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటాయని.. మీలో ప్రతీ ఒక్కరికీ ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటుందని ట్వీట్ చేశాడు.
కాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో తనవంతు సహాయం అందించారు మహేష్ బాబు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళాన్ని అందించారు. కరోనా క్రైసిస్ చారిటీ కి రూ. 25 లక్షల సహాయం ప్రకటించారు ప్రిన్స్.
Tags : Mahesh Babu, CoronaVirus, Covid19, Tollywood