ప్రిన్స్‌తో ‘నీల్’ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మీద హిట్ కొడుతున్నారు. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సక్సెస్ స్వింగ్‌లో ఉన్న ప్రిన్స్…. వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా, ప్రొఫెసర్‌గా టు షేడ్స్‌లో కనిపించనున్నారు. మహేష్ తర్వాతి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఫిల్మ్ నగర్‌లో. బ్లాక్‌బస్టర్ హిట్ కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో మహేష్ నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుందని టాక్. ప్రశాంత్ నీల్ […]

Update: 2020-02-17 06:05 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మీద హిట్ కొడుతున్నారు. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సక్సెస్ స్వింగ్‌లో ఉన్న ప్రిన్స్…. వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా, ప్రొఫెసర్‌గా టు షేడ్స్‌లో కనిపించనున్నారు. మహేష్ తర్వాతి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఫిల్మ్ నగర్‌లో. బ్లాక్‌బస్టర్ హిట్ కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో మహేష్ నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుందని టాక్. ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన మహేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. పాన్ ఇండియా మూవీగా రాబోతోన్న సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థలో అల్లు అరవింద్ నిర్మిస్తాడని సమాచారం. మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో సినిమా పూర్తికాగానే మహేష్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో చేస్తాడు. అప్పటిలోగా కేజీఎఫ్ 2 సినిమా పూర్తవుతుంది.

Tags:    

Similar News