రాష్ట్ర పండుగగా ‘ వాల్మీకి మహర్షి జయంతి’
హైదరాబాద్: వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులుజారీ చేసింది. ఈనెల 20వ తేదీన అశ్వయుజ పౌర్ణమినాడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరపనున్నారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాలకు అయ్యే ఖర్చులను బీసి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తనబడ్జెట్‌లో కేటాయిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలను అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని, ప్రతి […]
హైదరాబాద్: వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులుజారీ చేసింది. ఈనెల 20వ తేదీన అశ్వయుజ పౌర్ణమినాడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరపనున్నారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాలకు అయ్యే ఖర్చులను బీసి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తనబడ్జెట్‌లో కేటాయిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలను అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, ఉత్సవాల సమయంలో శానిటైజర్‌లను అందుబాటులో ఉంచాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.